Asia Cup: క్రికెట్ గాడ్ రికార్డుపై రోహిత్, కోహ్లీ కన్ను.. ఇద్దరిలో ఎవరు ముందు బ్రేక్ చేస్తారు? ఆసియా కప్ సమరానికి సమయం దగ్గర పడింది. రేపటి(ఆగస్టు 30) నుంచే టోర్నీ మొదలవనుంది. ఫస్ట్ మ్యాచ్‌లో పాక్‌తో నేపాల్ తలపడనుంది. ఇక ఆసియా కప్‌లో భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో సచిన్ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో రోహిత్, కోహ్లీ ఉన్నారు. సచిన్ రికార్డును ఇద్దరిలో ఎవరు ముందు బ్రేక్ చేస్తారన్నది చూడాల్సి ఉంది. By Trinath 29 Aug 2023 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Asia cup 2023 record alert kohli vs sachin vs rohit: ఆసియా కప్‌కి రంగం సిద్ధమైంది.. రేపటి(ఆగస్టు 30) నుంచి మొదలుకానున్న ఈ సంగ్రామానికి అన్ని జట్లు రెడీ అయ్యాయి. ఏ జట్టును తక్కువ అంచనా వేయాడానికి ఛాన్స్ లేదు.. కేవలం ఇండియా, పాకిస్థాన్ మాత్రమే తోపు..మిగిలిన జట్లు పసికూన అని భావిస్తే పప్పులో కాలేసినట్టే లెక్క. ఇదే విషయాన్ని ఇప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్పాడు. గతేడాది ఆసియా కప్ గెలిచింది శ్రీలంకనన్న విషయం మరవద్దన్నాడు. కేవలం పాక్‌తో ఫైట్ మాత్రమే టఫ్ అని అనుకోవద్దు అని.. అన్ని జట్లతోనూ జాగ్రత్తగా ఉండాలన్నాడు రోహిత్. రేపు పాకిస్థాన్ వర్సెస్ నేపాల్ మ్యాచ్‌తో ఆసియా కప్‌కు తెరలేవనుండగా.. సెప్టెంబర్ 2న ఇండియా ఈ టోర్నిలో తన తొలి మ్యాచ్‌ను పాక్‌తో ఆడనుంది. ఆ రికార్డుపై కన్ను: టీమిండియా అభిమానులు జట్టు గెలుపోటముల గురించి ఎంత చర్చించుకుంటారో వ్యక్తిగత రికార్డుల గురించి అంతే డిస్కస్ చేసుకుంటారు. ముఖ్యంగా తమ అభిమాన బ్యాటర్ రికార్డులపై వారి చూపు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత టీమ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఇక ప్రస్తుతం వీరిద్దరిని ఓ రికార్డు ఊరిస్తోంది. అదే క్రికెట్ గాడ్ సచిన్ రికార్డు. ఆసియా కప్‌లో భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్.. ఇప్పుడా రికార్డును చెరిపేసేందుకు కోహ్లీ, రోహిత్ రెడీ అయ్యారు. అయితే ఇద్దరిలో ఎవరు ముందుగా సచిన్ రికార్డును బ్రేక్ చేస్తారన్నదానిపై ఇప్పటికే క్రికెట్ ట్విట్టర్ పండితులు ఎవరికి నచ్చిన జోస్యం వాళ్లు చెబుతున్నారు. రోహిత్‌కే ఛాన్స్? ఆసియా కప్ వన్డేల్లో సచిన్ టెండూల్కర్ 971 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 745 పరుగులతో ఐదో స్థానంలో ఉండగా, కోహ్లీ 613 పరుగులతో 12వ స్థానంలో ఉన్నారు. రోహిత్ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా 226 పరుగులు చేయాల్సి ఉండగా.. అటు సచిన్ రికార్డును అధిగమించడానికి కోహ్లీ 358 పరుగులు దూరంలో ఉన్నాడు. ఇద్దరు తమదైన శైలిలో రెచ్చిపోతే కచ్చితంగా సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది. అయితే ఎవరు ముందుగా బ్రేక్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రోహితే ముందుగా సచిన్‌ని అధిగమిస్తాడని సోషల్‌మీడియా క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతుండగా.. కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం తమ కింగే గాడ్ రికార్డులను బద్దలు కొట్టడానికి పుట్టాడని చెబుతున్నారు. మరి ఎవరూ ముందుగా సచిన్ రికార్డును బ్రేక్ చేస్తారన్నది వెయిట్ అండ్ సీ! ALSO READ: టీమిండియాకు గట్టి షాక్..గాయంతో తొలి రెండు వన్డేలకు స్టార్ ప్లేయర్ దూరం! #virat-kohli #rohit-sharma #sachin-tendulkar #asia-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి