చంద్రబాబు, పవన్‌ కలవకూడదని జగన్ కుట్ర చేశాడు.. లోకేష్ ఫైర్!

సీఎం జగన్ పై యువగళం పాదయాత్రలో విమర్శలు గుప్పించారు లోకేష్. చంద్రబాబు, పవన్‌ కలవకూడదని జగన్‌ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 2024లో టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

New Update
చంద్రబాబు, పవన్‌ కలవకూడదని జగన్ కుట్ర చేశాడు.. లోకేష్ ఫైర్!

Lokesh Yuvagalam: 2024 ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ప్రభుత్వాన్ని ఓడించి.. టీడీపీని (TDP) తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు లోకేష్ (Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని.. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ముమ్మిడివరంలో యువగళం పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెడుతుందని.. అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదు మాది కాదని లోకేష్ అన్నారు. తన పాదయత్ర అడ్డుకోవడానికి వైసీపీ నేతలు చాలా ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ జగన్‌ (Jagan) మాట విన్న అధికారులు ఇప్పుడు ఢిల్లీకి క్యూ కడుతున్నారని అన్నారు.

ALSO READ: వేంకటేశ్వరుడి ముందు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు..రేవంత్ ప్రత్యేక పూజలు

ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతూ మెమోలు ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 3 నెలలు ఓపిక పట్టాలని ఉపాధ్యాయులను నారా లోకేష్ కోరారు. జగన్‌ మాటలు విని చట్టం ఉల్లంఘించిన అధికారులు ఢిల్లీలో ఉన్నా వదిలిపెట్టను అని హెచ్చరించారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) కలవకూడదని సీఎం జగన్‌ విశ్వప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. అక్రమ కేసుల్లో జైలులో ఉన్న చంద్రబాబును చూసి పవన్‌ కూడా బాధపడ్డారని తెలిపారు. నేను ప్రజల్లో ఒకడిని, ఆంధ్రా యువకుడిని అని అన్నారు.

ముమ్మిడివరం మీటింగ్ లో నారా లోకేష్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పై ఆరోపణలు చేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ను కలెక్షన్ కుమార్ గా అభివర్ణించారు. నాలుగు సంవత్సరాలలో నాలుగు వందల కోట్ల రూపాయలు ఎమ్మెల్యే పొన్నాడ దోచేశాడని వైసిపి నాయకులే పాదయాత్రలో తనకు చెప్పారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్దలాలలో కలెక్షన్ కుమార్ భారీ కుంభకోణం చేశాడని ఆరోపించారు.తక్కువ రేటుకు భూములు కొని ఎక్కువరేటుకు ప్రభుత్వానికి అంటగట్టాడు.. మత్యకారులకు ONGC పరిహారంలో కమీషన్ కొట్టేస్తున్నడు... తన బావమరిదితో కలిసి మట్టి, ఇసుకను దోచుకుంటున్నాడని ఫైర్ అయ్యారు.

ALSO READ: తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు