Ap CM Jagan:త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతా-ఏపీ సీఎం జగన్ త్వరలోనే నేను విశాఖకు షిఫ్ట్ అవున్నాను అంటూ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. పరిపాలనా విభాగం అంతా విశాఖకు మారుతుందని కన్ఫార్మ్ చేశారు. డిసెంబర్ లోపు ఇక్కడకు మారుతానని చెప్పారు. ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖ రూపుదిద్దుకుంటోందని అన్నారు. అన్ని రంగాల్లో విశాక అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ కు హబ్ గా మారిందన్నారు జగన్. By Manogna alamuru 16 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీ రాజధాని విశాఖకు మారడం మీద సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు వైజాగ్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతానని...డిసెంబర్ లోగా వచ్చేస్తానని జగన్ కన్ఫార్మ్ చేశారు. రాష్ట్రంలోనే విశాఖ పెద్ద నగరం అని అందుకే విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుందని తెలిపారు. అభివృద్ధిలో విశాఖ నగరం శరవేగంగా దూసుకుపోతోందని జగన్ అన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా తయారైందని...మరికొన్ని రోజుల్లో హైదరాబాద్,బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని చెప్పారు. విశాఖలో పెట్టుబడుల పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. Also Read:నీరసంగా మొదలైన దేశీయ మార్కెట్లు విశాఖలో ప్రతీ ఏడది 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారని సీఎం జగన్ అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని అన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఎలాంటి సదుపాయం కావాలన్నా ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైజాగ్‌లో విస్తారమైన అవకాశాలున్నాయని చెప్పారు. Also Read:హమాస్ తో మాకు ఏమీ సంబంధం లేదు…పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ #andhra-pradesh #jagan #visakha #cm #sihting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి