/rtv/media/media_files/2024/11/18/F8e8GAnxMgBigc7vT1Sn.jpg)
RGV
కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశారని, ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు అయింది. మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికి సీఐడీ అధికారులు రెండుసార్లు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 10న మొదటిసారి నోటీసులు జారీ చేశారు. కానీ వర్మ విచారణకు వెళ్ళలేదు. మార్చి 5న కూడా మళ్ళీ సీఐడీ నోటీసులు పంపించింది. ఇక, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై గతంలో సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టులపై కూడా కేసులు నమోదు అయ్యాయి.
తొందరపాటు వద్దు..
ఈ నేపథ్యంలో తాజాగా రాంగోపాల వర్మకు సీఐడీ విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు పంపించింది. అయితే ఈ నోటీసులపై ఆయన ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై నిన్న కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకో వద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. దాంతో పాటూ ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం.
today-latest-news-in-telugu | rgv | cid | andhra-pradesh | high-court
YS Vijayamma: వైఎస్ ఫ్యామిలీలో ఆగని రచ్చ .. NCLTలో విజయమ్మ, షర్మిల కౌంటర్
సరస్వతి పవర్ కంపెనీలో తన మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మంగళవారం విజయమ్మ, షర్మిల విడివిడిగా కౌంటర్ ధాఖలు చేశారు.
ys jagan
మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కుటుంబంలో మొదలైన చిచ్చు ఆగడం లేదు. సరస్వతి పవర్ కంపెనీ (Saraswati Power Company) లో తన పేరు మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది ట్రైబ్యునల్ ను కోరారు. తాజాగా మంగళవారం ఇద్దరు విడివిడిగా కౌంటర్ ధాఖలు చేశారు.
Also Read : 'సంతాన ప్రాప్తిరస్తూ'.. డాక్టర్ భ్రమరం వచ్చేశాడు.. పోస్టర్ వైరల్!
విజయమ్మ సంచలన ఆరోపణలు
ఈ సందర్భంగా కౌంటర్లో విజయమ్మ (YS Vijayamma) సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు జగన్, కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. పిల్లల మధ్య వివాదం కారణంగా తాను ఇలా కోర్టు గదిలో నిలబడాల్సి రావడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్, భారతి ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ఫ్యామిలీ సెటిల్మెంట్‌లో జోక్యం చేసుకునే అధికారం ఎన్సీఎల్టీకి లేదని తెలిపారు. విజయమ్మ, షర్మిల తరఫున విశ్వరాజ్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. ఆన్‌లైన్‌లో తాము కౌంటర్లు దాఖలు చేశామని.. ఒకట్రెండు రోజుల్లో భౌతికంగా సైతం ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ తదుపరి విచారణను 2025 మార్చి 6కు వాయిదా వేసింది.
Also Read : వరంగల్ కు రాహుల్ గాంధీ.. ఏంటీ సడన్ టూర్ ?
Also Read : రోజూ కిలో మీటరు నడిస్తే.. ఈ సమస్యలన్నీ పరార్
ఇక సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో తనకు 51.01 వాటా ఉందని వైఎస్ జగన్ పిటిషన్ లో వెల్లడించారు. భవిష్యత్తులో తన సోదరి షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా 2019 ఆగస్ట్ 31న ఒప్పందం చేసుకున్నట్టుగా వెల్లడించారు. అయితే తనకు తెలియకుండానే, బదిలీ ఫారాలు, డాక్యుమెంట్లు, సంతకాలు లేకుండానే తన తల్లి, సోదరి షేర్లను బదిలీ చేసుకున్నారని జగన్ పేర్కొన్నారు. ఇది కంపెనీ చట్టానికి విరుద్ధమని, షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరిట ఉన్న 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని ట్రైబ్యునల్ ను కోరారు.
Also Read : Delhi BJP : ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత అధికారం.. బీజేపీ ముందున్న పది సవాళ్లు ఇవే!
AP: హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు
విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Kodali Nani: మరో నెల రోజులపాటు ముంబైలోనే కొడాలి నాని.. టెన్షన్లో అభిమానులు!
కొడాలి నానికి ఇటీవలే బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Venkatesh: వెంకటేష్ ఫ్యామిలీకి చంద్రబాబు సర్కార్ షాక్!
నటుడు వెంకటేష్ ఫ్యామిలీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Varma Vs Nagababu: పిఠాపురంలో వర్మకు మరో బిగ్ షాక్.. జనసేన అధికారిక ప్రకటన!
పిఠాపురంలో రేపు, ఎల్లుండి ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Yuzvendra Chahal - RJ Mahvash: ఆమెకు మనసిచ్చేసిన చాహల్.. ఒక్క లైక్‌తో దొరికేసాడుగా!
ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
AP: హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు
Kodali Nani: మరో నెల రోజులపాటు ముంబైలోనే కొడాలి నాని.. టెన్షన్లో అభిమానులు!
Waqf Bill: వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం