YS Sharmila: మోదీ చేతకాని వాడేనా? అదానీ కేసుపై షర్మిల సంచలన కామెంట్స్!

అదానీ అవినీతి కేసుపై మోదీ, చంద్రబాబు మౌనం వీడాలని ఏపీసీసీ షర్మిల అన్నారు. అదానీ-జగన్ రూ.1750 కోట్ల ముడుపులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ చేతకానిదా? మోదీ చేతకాని వాడా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

author-image
By srinivas
New Update
ఇఆఆ

Sharmila: అదానీ అవినీతి కేసులో మోదీ, చంద్రబాబుపై ఏపీసీసీ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. అదానీ దోపిడిగురించి ఇంత జరుగుతున్న ఎందుకు మౌనం వీడట్లేదని ప్రశ్నించారు. అదానీ-జగన్ రూ.1750 కోట్ల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా నిరసన తెలిపిన షర్మిల.. వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని విమర్శలు గుప్పించారు. అనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. 

అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు..

అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది. సోలార్ పవర్ డీల్ లో జగన్ కు రూ.1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించింది. ఆధారాలు కూడా బయట పెట్టింది. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా? ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదు? 2021లో ప్రతిపక్షంలో ఉన్న TDP ఈ సోలార్ డీల్ పై హైకోర్టులో పిటీషన్ కూడా వేశారు. ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల ఆర్థిక భారం అని ఆరోపణ చేశారు. అదానీ డీల్ వెనుక అవినీతి జరిగిందని తెలుసు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. కోర్టు కేసు వేసిన పయ్యావుల మంత్రిగా ఉన్నారు. అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. 

అదానీ బీజేపీ మనిషి.. మోదీ మనిషి..

అలాగే జగన్, చంద్రబాబుకు నష్టమేమి లేకపోయినా రాష్ట్ర ప్రజలు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. అదానీతో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన అధికార భారం పడుతుందన్నారు. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కు 10 రూపాయలు ఉండేదని, ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గిందని చెప్పారు. రేపు 50 పైసలకే తగ్గొచ్చు. సోలార్ పవర్ రెట్లు తగ్గుంటుంటే.. మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు. 2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారు. చంద్రబాబును అడుగుతున్నాం.. అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని. అదానీ అనే పేరు కూడా ఎందుకు ఉచ్ఛరించడం లేదు? అదానీ బీజేపీ మనిషి.. మోదీ మనిషి. బీజేపీతో మీకు అలయెన్స్ ఉంది. అందుకే మీరు అదానీకి, మోదీకి బయపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు!

రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నారని చెప్పిన షర్మిల.. మోదీ ఎందుకు నోరు విప్పడం లేదని అడిగారు. మొత్తం దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని, అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదని అన్నారు. ఈ అవినీతి బయట పెట్టని CBI చేతకానిదా? మోదీ చేతకాని వాడా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ ACBనీ బంది చేశారు. పంజరంలో చిలక మాదిరిగా బంధించారు. వెంటనే ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ ప్రజల కోసం ఉన్న సంస్థ. ఈ లంచాల వ్యవహారాన్ని ఏసీబీ బయట పెట్టాలి. ఇప్పటికే రాష్ట్రం నెత్తిన విద్యుత్ చార్జీల భారం మోపారు. ఈ డీల్ వల్ల 1.50 లక్షల కోట్ల భారం పడుతుంది. చంద్రబాబు మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి. జగన్ తన సొంత ప్రయోజనం కోసం డీల్ చేస్తున్నారు.  ఆయనకు మీకు తేడా లేదు.  ప్రజలు కూటమి నీ నమ్మి రాత్రి 9 గంటల దాకా లైన్లో నిలబడి ఓట్లు వేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండి అంటూ ఆమె మండిపడ్డారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

New Update
EC

AP by-election EC notification released

BIG BREAKING: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదలచేసి మే 9న పోలింగ్ జరగనుంది. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

29 వరకు నామినేషన్ల స్వీకరణ..

ఈ మేరకు ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా.. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నట్లు తెలిపారు. మొత్తంగా మే 13వ తేదీలోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

 

mp | ap | ec | notification | telugu-news | today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment