YS Sharmila: జగన్ మోసం చేశారు.. మీరైనా మాట నిలబెట్టుకోండి చంద్రబాబు: షర్మిల డిమాండ్!

ఏపీ ప్రభుత్వ తీరుపై వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ఏడాదికి రూ.5 వేల కోట్ల ధరల స్థిరీకరణ కోసం కేటాయించి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండని అన్నారు. జగన్ ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదన్నారు.

New Update
YS Sharmila fire on ex cm ys jagan and present cm chandrababu

YS Sharmila fire on ex cm ys jagan and present cm chandrababu

ఏపీ ప్రభుత్వ తీరుపై APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి సోషల్ మీడియాగా ఫైర్ అయ్యారు. లక్షల్లో అప్పులు, రోజుకో బలవన్మరణంతో రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని మండిపడ్డారు. ఇది మన రాష్ట్రంలో రైతుల దీనస్థితి అని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని అన్నారు. ఈ విషయంలో రైతులను పట్టించుకొనే దిక్కు లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మహానేత YSR సీఎంగా ఉన్నప్పుడు అన్నపూర్ణగా పేరొందిందని.. పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపారని గుర్తు చేశారు. 

కానీ నేడు గిట్టుబాటు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. మిర్చి రైతు విలవిలాడుతుంటే.. కంది రైతు కంట కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయల ధరలకు మార్కెట్‌లో రెక్కలొస్తున్నా.. రైతుకు పెట్టుబడి మందం మాత్రం అందక పండిన పంటకు నిప్పు పెట్టుకొనే దీనస్థితి ఏర్పడిందన్నారు. 

Also Read :  మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

చంద్రబాబు మాట తప్పారు

ధర లేక దిగాలు పడుతున్న రైతాంగానికి గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు మాయ మాటలు చెప్తూనే ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు (Chandrababu) మొదటి 5 ఏళ్లు ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మాట తప్పితే.. జగన్ (YS Jagan) ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారని ఫైర్ అయ్యారు. 

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

రైతులను నిండా ముంచారు

ఇద్దరు కలిసి రాష్ట్ర రైతులను నిండా ముంచారని విమర్శించారు. ధరల స్థిరీకరణ పేరుతో రాజకీయాలు చేశారు తప్పిస్తే రూపాయి ఇచ్చింది లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యానికి బస్తాకు రూ.1400 మించి ధర అందలేదన్నారు. పత్తి ధర రూ.12 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయిందని గుర్తు చేశారు. 

Also Read :  USA:  ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్

డిమాండ్ చేస్తున్నాం

మిర్చి ధర అయితే రూ.23 వేలు అందాల్సిన చోట రూ.11 వేల కంటే ఎక్కువ ధర దక్కలేదని తెలిపారు. ఇక కంది రూ.10 వేల నుంచి రూ.7 వేలకు మార్కెట్ ధర తగ్గిందన్నారు. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ధరల స్థిరీకరణ నిధిని తక్షణం ఏర్పాటు చేయండని డిమాండ్ చేశారు. 

Also Read :  USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి

ఏడాదికి రూ.5 వేల కోట్లు ధరల స్థిరీకరణ కోసం కేటాయించండని.. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండని షర్మిల తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పిన రూ.20 వేల సహాయాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు