Srikakulam : గంజాయి తాగిన యువకులు. పట్టుకున్న ఎమ్మెల్యే...అసలు ట్విస్ట్ ఏంటంటే...

శ్రీకాకుళంలో స్థానిక మార్కెట్‌ను పరిశీలిస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు గంజాయి బ్యాచ్‌ చిక్కింది.మార్కెట్‌లోని పాడుబడిన భవనాలపై కూర్చొని గంజాయి సేవిస్తున్న ఇద్దరు విద్యార్థులను ఎమ్మెల్యే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.

New Update
Srikakulam mla

Srikakulam mla

Srikakulam : శ్రీకాకుళంలో స్థానిక మార్కెట్‌ను పరిశీలిస్తున్న స్థానిక ఎమ్మెల్యేగొండు శంకర్‌కు గంజాయి బ్యాచ్‌ చిక్కింది. మార్కెట్‌లోని పాడుబడిన భవనాలపై కూర్చొని గంజాయి సేవిస్తున్న ఇద్దరు విద్యార్థులను ఎమ్మెల్యే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మంగళవారం పొట్టిశ్రీరాములు మార్కెట్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు యువకులను పట్టుకున్నారు. ఆరా తీస్తే గంజాయి సేవించినట్టు తేలింది. దీంతో ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి నుంచి గంజాయిని, సేవించడానికి వినియోగిస్తున్న బాటిల్‌, గంజాయి దట్టించిన గొట్టం, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. గంజాయి ఎక్కడ నుంచి తీసుకువచ్చారు తదితర వివరాలపై ఆరా తీస్తున్నారు. 

Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!

గంజాయి సేవిస్తున్న ఇద్దరిని ఎమ్మెల్యే గొండు శంకర్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఇద్దరు యువకులు గంజాయి సేవిస్తూ ఎమ్మెల్యేకు చిక్కారు. పొట్టిశ్రీరాములు పెద్ద మార్కెట్‌లో మంగళవారం పర్యటించిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి నిరుపయోగంగా ఉన్న మార్కెట్‌ భవనాలు పరిశీలించారు. ఆ టైంలోనే అనుమానాస్పదంగా ఉన్న దమ్మలవీధికి చెందిన ఇద్దర్ని ఎమ్మెల్యే గుర్తించారు. వారిని ఎమ్మెల్యే శంకర్‌, ఆయన సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించారు. తనిఖీలు చేశారు. విచారణ చేస్తే వారు గంజాయి సేవిస్తున్నట్టు బయటపడింది. పోలీసులకు ఫోన్‌ చేసి ఇద్దరు యువకులను అప్పగించారు. 

ఇది కూడా చదవండి: Postal Jobs 2025: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

గంజాయి సేవిస్తున్న యువకులను పట్టుకున్నట్టు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని పెద్దమార్కెట్‌లో నిరుపయోగంగా ఉన్న భవనాలపైన అసాంఘిక కార్యాకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని చెప్పడానికి అక్కడ ఖాళీ మద్యం సీసాలే నిదర్శనమని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. రోజుకు 16 గంటలు రద్దీగా ఉండే పెద్దమార్కెట్‌లో గంజాయి సేవించడానికి యువకులు అడ్డాగా మార్చుకున్నారనడానికి ఈ వ్యవహారమే నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Also Read: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

గంజాయి విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు  ప్రజలు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఎమ్మెల్యే.  ప్రధానంగా యువత చెడిపోవడానికి తల్లిదండ్రులేనని వారి సరైన మార్గంలో పెట్టాలని సూచించారు. కాలేజ్‌కు వెళ్లవలసిన యువకులు గంజాయి సేవిస్తూ దొరకడంపై ఒక్కసారిగా నగరంలో కలకలం రేగింది. కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టేలా చేయాలన్నారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు జరిమానా విధిస్తే మార్పు వస్తుందని అన్నారు. 

Also Read: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment