BIG BREAKING: జనసేన ఎమ్మెల్యేకు సీరియస్.. హైదరాబాద్‌కు తరలింపు!

జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాయకర్‌ను కుటుంబ సభ్యులు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. టైఫాయిడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు.

New Update
V BREAKING

breaking news

పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నాయకర్‌ను భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించగా.. టైఫాయిడ్ ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో నాయకర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల ప్రమాదం నుంచి బయట పడి..

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ప్రమాదం నుంచి బొమ్మిడి నాయకర్ బయటపడిన విషయం తెలిసిందే. అమరావతిలోని ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం దగ్గర కారు వెళ్తుండగా బైక్ అడ్డు రావడంతో కారు ముళ్ల పొదల్లోకి వెళ్లింది. అదృష్టం కొలది బొమ్మిడి నాయకర్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: పేదలకు సీఎం చంద్రబాబు శుభవార్త!

పేదలకు ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.అవసరాన్నిబట్టి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో వర్చువల్ వైద్యసేవలు అందించనున్నారు. 

New Update
CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!

BIG BREAKING: పేదలకు ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.అవసరాని బట్టి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో వర్చువల్ వైద్యసేవలు అందించనున్నారు. \

మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్..

ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 175 నియోజకవర్గాల్లో 100 పడకలకుపైగా సామర్ధ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 ఉండగా మరో 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలన్నారు. ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వైద్యసేవల్ని మరింత విస్తృత పరచాలని, అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

ఇక ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. విద్య-వైద్య రంగాలు తమ ప్రాధామ్యాలుగా చెప్పిన ఆయన.. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలన్నారు. అన్యారోగ్యం బారిన పడిన తర్వాత వైద్యసేవలు అందించే పరిస్థితి నుంచి.. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. రూ.32.5 కోట్లతో 25 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లను సేవలు పెంచడంతోపాటు కొత్తగా మరో 13 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

Also Read: వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి

ఏజెన్సీ ఏరియాలోని పీహెచ్‌సీల్లో వైద్య ఖాళీల భర్తీ, విజయనగరంలో కొత్తగా 8 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై సమీక్షించారు. ఎన్టీఆర్, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో డయాలసిస్ మెషిన్లు పెంచడం, కొవ్వూరు-నిడదవోలు సీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలపైన మార్గదర్శకాలు జారీ చేశారు. కుప్పం డిజిటల్ నెర్వ్ సెంటర్ (DiNC) పురోగతి గురించి ఆరాతీశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ అందించడానికి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ దోహదపడుతుందని, దేశంలోనే అత్యధికంగా 4.47 కోట్ల (88 శాతం) మందికి రాష్ట్రంలో అభా కార్డులు జారీ అయ్యాయని తెలిపారు. 

cm-chandrababu | hospitals | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment