/rtv/media/media_files/2025/03/26/xNp18Of4uIG4pDJiOKxw.jpg)
Vizianagaram police catch playing cards gang with drone
AP Viral News: పేకాట రాయుళ్లపై విజయనగరం పోలీసులు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. పార్కింగ్ చేసిన లారీలో ఓ గ్యాంగ్ రహస్యంగా పేకాట ఆడుతుండగా డ్రోన్ సహాయంతో పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా పోలీసులపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్.. అన్న నినాదానికి అర్ధం చెప్పిన ఘటన ఇది. ఎవరికీ దొరక్కుండా లారీలో పేకాడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు. టెక్నాలజీతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు అభినందనలు.
— Anitha Vangalapudi (@Anitha_TDP) March 26, 2025
#ChandrababuNaidu #NaraLokesh pic.twitter.com/OKGcdpZscG
ఇన్విజిబుల్ పోలీస్..
విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అన్న నినాదానికి అర్ధం చెప్పిన ఘటన ఇది అంటూ పొగిడేస్తున్నారు. టెక్నాలజీతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు అభినందనలు. ఇదే ఫోకస్ అన్ని నేరాలపై పెట్టండి. రాష్ట్రంలో ఉన్న దొంగ నాయకులపై కూడా చూపించాలని కోరుతున్నారు. ఆ నిఘా కొంచం నాయకులు/కార్యకర్తల మీద పెట్టండి అనిత గారు. వాళ్ళ అరాచకాలకు అడ్డు అదుపు ఉండటం లేదు అంటూ హోమంత్రికి సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Komatireddy Rajagopal Reddy: మా రేవంత్ రెడ్డి చాలా మంచోడు...లేకుంటే....
ఇదిలా ఉంటే.. అప్పట్లో అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు రావు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
vijayanagaram | police | telugu-news | today telugu news