/rtv/media/media_files/2025/04/05/9oeGAcDr0VHTMc1mmRvn.jpg)
vijayanagaram crime
AP Crime: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువతి శనివారం ఇంటి ముందు దుస్తులు ఉతుకుతుండగా.. ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో తెలియదు కానీ.. మాస్క్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి వచ్చి కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
కత్తితో పొడిచి పరార్..
వెంటనే చుట్టు పక్కల వారు గమనించి 108కి ఫోన్ చేశారు. ఆమెను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. కత్తితో పొడిచి పరారైన వ్యక్తి కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చిన వ్యక్తి ఎవరు.. ఆమెకు ఆ వ్యక్తికి ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: లంగ్స్ బేషుగ్గా ఉండాలంటే తులసి ఆకులు నమలండి
( ap-crime-news | latest-news )