/rtv/media/media_files/2025/03/17/HODCy77LvgLpzzUiXy0R.jpg)
vizianagaram Bhogapuram International Airport construction work Accident
విజయనగరం జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుని 2200 ఎకరాలలో నిర్మిస్తున్నారు. 3 దశల్లో విమానాశ్రయ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా పనులు జరుగుతున్నాయి. అలాగే మిగత రెండు దశల్లో కూడా మరింత మంది కోసం పనులు జరుగుతున్నాయి.
Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!
2026 జూన్ నాటికి
ఈ విమానాశ్రయం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి.. 2026 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు చకచకా చేస్తున్నారు. ఈ క్రమంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేస్తూ దాదాపు 15 రోడ్ల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల్లో తాజాగా అపశ్రుతి చోటుచేసుకుంది.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
బ్లాస్టింగ్
ఈ నిర్మాణ పనుల్లో భారీ ప్రమాదం సంభవించగా ఓ వ్యక్తి చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లోపల రహదారుల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో రోడ్ల నిర్మాణానికి బండరాళ్లు అడ్డుగా వచ్చాయి. దీంతో వాటిని తొలగించేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే బండరాళ్లను బాంబులు పెట్టి పేల్చేందుకు ప్రయత్నించారు.
Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఈ తరుణంలో ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరగటంతో రామచంద్రపేటకు చెందిన బోర కొత్తయ్య అనే వ్యక్తి బ్లాస్టిగ్ సమీపంలో ఉండటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గమనించి అతడిని హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విషయం తెలిసి మృతుని భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.