Vande Bharat: విశాఖ–సికింద్రాబాద్ వందే భారత్ షెడ్యూల్ మార్పు
విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ షెడ్యూల్లో మార్పులు చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రైలు ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులూ నడుస్తోంది. ఇప్పుడు ఈ సెలవును మంగళవారానికి మార్చారు.
విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ షెడ్యూల్లో మార్పులు చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రైలు ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులూ నడుస్తోంది. ఇప్పుడు ఈ సెలవును మంగళవారానికి మార్చారు.
AP: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు విశాఖ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అభ్యర్థిపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను బరిలోకి దించింది వైసీపీ.
విశాఖ ఆర్కే బీచ్‌లో ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. జట్టి నుంచి ఆర్కే బీచ్‌కు బోటుకు కొట్టుకువచ్చింది. ప్రమాద సమయంలో ఐదుగురు మత్స్యకారులు బోటులో ఉన్నారు. అలల ప్రభావంతో బోటు ముక్కలు ముక్కలైంది. అయినప్పటికీ ఐదుగు మత్స్యకారులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
AP: ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండో రోజు ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్ధేశం చేయనున్నారు. కాగా తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ ప్రకటించగా.. కూటమి ఇంకా ప్రకటించలేదు.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. కూటమికి 10కి 10 స్థానాలు దక్కాయి. బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలు ఉన్నాయని ఆ ఓట్లను తీసేయాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర బైటాయించి నినాదాలు చేశారు.
అల్లూరు జిల్లా గుంజీవాడలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. జంగూడ - గుంజీవాడ మధ్య వెంటనే వంతెన నిర్మించాలని డిమాండ్ చేపట్టారు. వృద్దులు, గర్భిణీలు, చిన్నారులు గడ్డ దాటలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీపై తనకు ఎలాంటి కక్ష లేదని, తనకు ఎవరూ శత్రువు కాదన్నారు. అందరూ కలిసిగట్టుగా రాష్ట్ర, పార్టీ అభివృద్ధికోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఐదు మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.
AP: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. జిల్లాలోని వైసీపీకి 644 మందికి పైగా సభ్యుల సంఖ్యా బలం ఉందని.. ఈ ఎన్నికలో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు.