AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..టూరిజం పాలసీకి ఆమోదం

 ఏపీ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

New Update
Andhra Pradesh: రేపు సమావేశమవనున్న ఏపీ కేబినెట్

AP Cabinet Meeting - Chandrababu

ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌లో టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించాలని నిర్ణయించారు. అలాగే జ్యుడిషియల్‌ ప్రివ్యూ రద్దు బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్‌ఫ్రా ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్‌ 2019 రిపీట్‌ చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకి కుదిస్తూ చట్ట సవరణ చేశారు.

Also Read :  పోలింగ్ బూత్ దగ్గర విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతి

Also Read :   వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు సర్కార్ కొత్త స్కెచ్.. మరి కోర్టులు ఒప్పుకుంటాయా?

ఇక 2024–25 కొత్త క్రీడా పాలసీని కూడా తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటూ డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్‌గా అంటే ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్‌గా మార్చాలన్న తీర్మానానికి మంత్ర వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు క్యాబినెట్ ఆమోదం లభించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులు బదలాయిస్తూ ప్రతిపాదన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు..
పీడీ యాక్ట్‌ను బలోపేతం చేస్తూ చట్ట సవరణకు ఆమోదం లభించింది. అలాగే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లింపులు పునరుద్ధరణ..లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు..అమరావతి సాంకేతిక కమిటీకి..ఏపీలో రూ. 85వేల కోట్ల పెట్టుబడులకు..SIPB నిర్ణయాలకు కేబినెట్ ఆమోదించింది.

Also Read: Maharashtra: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే!

Also Read:  పదేళ్లు ఏం వెలగబెట్టారని మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు.. బీఆర్‌ఎస్‌కు రేవంత్ చురకలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!

ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి ఆయన వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు.

New Update

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. రేపు సిట్‌ విచారణకు వస్తానని ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హాయంలో ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈ మేరకు సిట్ కూడా ఏర్పాటు చేసింది. కొంత మందికి లబ్ధి చేకూరేలా లిక్కర్ పాలసీ, ట్రాన్స్ పోర్ట్, టెండర్లలో మార్పులు చేసినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. దాదాపుగా రూ. 18,860 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.

కసిరెడ్డిదే కీలక పాత్ర..

ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు నిర్దారణకు వచ్చిన సిట్.. ఇప్పటికే ఆయనకు పలు మార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన స్పందించలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో సిట్ విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయిన కసిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఓ ఆడియో విడుదల చేశారు. రేపటి సిట్ విచారణకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. 

అయితే.. దుబాయ్ నుంచి రాజ్ కసిరెడ్డి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. అయితే.. ఆయనను పలు అంశాలపై విచారించి రేపు సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజ్ కసిరెడ్డి విచారణలో ఎవరి పేర్లు బయట పెడతారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

(telugu-news | telugu breaking news | latest-telugu-news | ap liquor scam)

Advertisment
Advertisment
Advertisment