/rtv/media/media_files/2025/03/17/JceMbhmFMSExAQCxmWGU.jpg)
VC Sajjanar warning to Bayya Sunny Yadav
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వీ.సీ సజ్జనార్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరి బండారం బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ లోకల్ బాయ్ నాని, బయ్యా సన్నీ యాదవ్ వంటి యూట్యూబర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం లోకల్ బాయ్ నాని అరెస్టు కాగా.. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవలే ఈ కేసుపై సూర్యాపేట ఎస్పీ స్పందించారు. బయ్యా సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నాడని.. ప్రస్తుతం అతడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ వేశామని అన్నారు. అతి త్వరలోనే బయ్యా సన్నీని పట్టుకుంటామని తెలిపారు.
Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!
ఇదే క్రమంలో సజ్జనార్ ఒక్కొక్కరి బండారాన్ని బయటపెట్టడంతో పోలీసులు తమవంతు పని చేసుకుంటూ పోతున్నారు. తాజాగా మరోసారి భయ్యా సన్నీ యాదవ్‌కి సంబంధించిన మరో వీడియోను సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రకారం.. భయ్యా సన్నీ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘సౌత్ అమెరికా వెళ్లాను. అక్కడ బ్రెజిల్, అర్జెంటీనాలో చాలా వీడియోలు చేశాను. కానీ వాటికి 60 నుంచి 70వేల వ్యూస్ కంటే ఎక్కువ రాలేదు. బ్రెజిల్ యాక్సిడెంట్ అయింది. బైక్‌కి రూ.4.50 లక్షలు అయింది. నాకు యూట్యూబ్ నుంచి రూ.2లక్షలు వస్తాది. నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి. నాకు వేరే ఆప్షన్ లేదు. నేను బెట్టింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే సర్వైవ్ అవ్వగలను’’ అని అందులో చెప్పుకొచ్చాడు.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
సజ్జనార్ మరో వీడియో
ఆ వీడియోపై స్పందించిన సజ్జనార్.. ‘‘చూశారా.. వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడమే ఒక్కటే మార్గమట. మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్. ఎందరో బెట్టింగ్‌కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుండి కూడా చూడలేకపోతున్నారా!?. యూట్యూబ్‌లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్‌ని మోసం చేస్తారా!? వీళ్లకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేస్తారు.. అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని బెట్టింగ్‌కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.’’ అంటూ రాసుకొచ్చారు.
చూశారా.. వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడమే ఒక్కటే మార్గమట.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 17, 2025
మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్.
ఎందరో బెట్టింగ్ కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుడి కూడా… pic.twitter.com/j9BOPznGdk
Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఇక సజ్జనార్ లిస్ట్‌లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరికొందరు యూట్యూబర్లు ఉన్నట్లు తెలిసింది. టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత, హర్షసాయి, వినయ్ కుయ్యా, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, డేర్ స్టార్ గోపాల్, విజ్జు గౌడ్, శ్రీధర్ చాప వంటి యూట్యూబర్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది. త్వరలో వీరికి సంబంధించిన బండారాన్ని బయటపెట్టబోతున్నట్లు సమాచారం.
Also Read : విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!