Duvvada Srinivas Viral Video: దువ్వాడ జంట ప్రేమికుల రోజు సంబరాలు.. కెమెరా ముందే హగ్గులు, కిస్సులతో ఓ రేంజ్‌లో!

దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి ప్రేమికుల రోజు సంబరాలు గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా ముద్దులు, హగ్గులతో బాగా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

New Update
duvvada srinivas divvala madhuri love story

Duvvada Srinivas Divvala Madhuri Love Story

Duvvada Srinivas Viral Video: ప్రేమ జంటలు ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. వాలెంటైన్స్ వీక్‌(Valentine's Week)లో నేడు చివరి రోజు అదే వాలెంటైన్స్ డే. ఈ సందర్భంగా ఎన్నో ప్రేమ జంటలు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ.. భాగస్వామికి నచ్చిన బహుమతులు అందజేస్తారు. తాజాగా ఓ పాపులర్ లవ్ కపుల్(Love Couple) సైతం తమ ప్రేమను వ్యక్తపరుచుకుంది. 

ఇటీవల కాలంలో వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas), దివ్వెల మాధురి(Divvala Madhuri) జంట కెమెరా ముందు తమ ప్రేమను తెలుపుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో శ్రీనివాస్, మాధురి.. రొమాంటిక్, చిలిపి చేష్టలతో రెచ్చిపోయారు. ఒకరినొకరు హగ్ చేసుకుంటూ, కిస్‌లు పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేశారు. 

Also read :  Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్‌ దాడి!

వాలెంటైన్స్ డే స్పెషల్‌గా

వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఒకరినొకరు తమ ప్రేమను పంచుకున్నారు. ఇప్పటికి ఎన్నో సార్లు ప్రజల మనసు దోచుకున్న ఈ జంట.. తాజాగా మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ జంట వాలెంటైన్స్ వీక్‌ను ఎంతో ఉత్సాహాంగా జరుపుకుంది. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని హృదయపూర్వక ప్రామిస్‌లు చేసుకున్నారు.

Also Read :  బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్‌ యాజమాన్యం దాడి

ముద్దులు, హగ్గులతో

అంతేకాకుండా ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ, ప్రేమ ప్రతిపాదనలు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాగే మరో వీడియోలో ఈ జంట ముద్దులు, హగ్గులతో బాగా ఎంజాయ్ చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Also Read :  మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !?

#breaking-news #latest-telugu-news #happy-valentines-day #duvvada-srinivas #divvala madhuri #divvala madhuri Love story #rtv telugu news #Duvvada Srinivas Viral Video
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు