/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/birdflue.jpg)
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇటు కృష్ణాజిల్లాను బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ బర్డ్ ఫ్లూ లక్షణాతో కొన్ని లక్షల కోళ్లు మృతి చెందాయి. తాజాగా ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తిలో కూడా ఈ లక్షణాలు బయటపడ్డాయి. ఇప్పటికే అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి కోళ్ల ఫారాలను, చికెన్ షాపులను బంద్ చేపిస్తున్నారు.
ఈ క్రమంలో కృష్ణాజిల్లా ఉయ్యూరు వీరమ్మ తల్లి జాతరలో దారుణం చోటు చేసుకుంది. మృతి చెందిన కోళ్లను వ్యాపారులు యథేచ్చగా అమ్మేస్తున్నారు. అవి బర్డ్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందినట్లు భక్తులు భావిస్తున్నారు. చచ్చిన కోళ్లను అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఈ విషయం పై స్పందించిన జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు మృతి చెందిన కోళ్ల నుంచి అధికారుల శాంపుల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఇప్పటికే మృతి చెందిన కోళ్లను పూడ్చిపెట్టామన్న అధికారులు..ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని,ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ వైరస్ గట్టిగానే ఉంది. తూర్పు గోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో కలకలం చెలరేగింది. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేటు దారుణంగా పడిపోయింది. కోళ్లకు వైరస్ సోకుతుందనే అనే ప్రచారం బాగా జరగడంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. అంతకుముందు కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి.