ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. శుక్రవారం జరిగే కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రెడీ అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది తిరుమలలో శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు.
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామ స్వామి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య జరిగే శ్రీ సీతా రాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ఉచిత ప్రసాదంగా అందజేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటిమిట్ట లో ఈ నెల 11వ తేదీన జరుగనున్న రాముల వారి కల్యాణం ఏర్పాట్లను టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మంతో కలసి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు.
Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
ఈ సందర్భంగా శుక్రవారం శ్రీకోదండరామ స్వామి కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నసందర్భంగా, ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహాం వద్ద ముఖ్యమంత్రి బస చేసే గదులలో ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ కోతలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలలో పచ్చదనం, పుష్పాలంకరణలు తాజా పుష్పాలతో ఏర్పాటు చేయాలన్నారు.
అటు తర్వాత టీటీడీ అతిథి గృహం నుంచి ఆలయం వరకు పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయంలోపుల ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో నిల్వ వున్న సామాగ్రి, వస్తువులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయం అంతా కలియ తిరిగారు. ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు విద్యుత్ కాంతులు, పుష్పలంకరణలలో రాజీ లేకుండా నాణ్యంగా పనులు చేపట్టాలని కోరారు.
అధికారులు సమన్వయంతో జిల్లా యంత్రాంగం, టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులు అందరికి అన్నప్రసాదాలు, స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, త్రాగునీరు, మజ్జిక పంపిణీ చేస్తామని చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్లు జిల్లా రెవిన్యూ, పోలీసు, స్థానిక పంచాయతీ, టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
Also Read: Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!
kadapa | sita rama kalyanam at vontimitta | vontimitta kalyanam | vontimitta-kodandaram | vontimitta ramalayam | vontimitta sitarama kalyanam | vontimitta sita rama kalyanam | ttd | laddu