/rtv/media/media_files/2025/01/20/I0quxOnPxazIphWiiOpN.jpg)
ips transewr Photograph: (ips transewr)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జనవరి 20 (సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్. మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఐజీపీ (ఆపరేషన్స్)గా సీహెచ్ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. అందేవిధంగా టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇది కూడా చదవండి: Dy CM Pawan: పవన్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ ఎగురవేసింది వాళ్లే.. అడిషనల్ ఎస్పీ సంచలన ప్రకటన!
ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా జి. పాలరాజు, ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా బి. రాజకుమారి బాధ్యతలు స్వీకరించనున్నారు. సుబ్బారాయుడు ప్లేస్ లో హర్షవర్ధన్ రాజుకు తిరుపతి ఎస్పీగా అవకాశం ఇచ్చారు.. తిరుపతిలోనే ఎర్రచందనం స్మగ్లర్ల నిరోధ బాధ్యతలు సుబ్బరాయుడుకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: కాబోయే సీఎం లోకేషే.. చంద్రబాబు సమక్షంలోనే మంత్రి సంచలన కామెంట్స్!