Carbon Monoxide: పుంగనూరులో విషాదం.. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి నలుగురు మృతి

ద్విచక్రవాహనం నుండి వచ్చే  కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు ఒక వృద్ధుడు మరణించాడు.

New Update
five members of same family found dead under suspicious circumstances in hyderabad

Dies from Carbon Monoxide Inhalation After Motorcycle Left Running

Punganur : ద్విచక్రవాహనం నుండి వచ్చే  కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు(Chittoor district Punganur) జిల్లా పుంగనూరు(punganur-case) పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు ఒక వృద్ధుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధికి చెందిన రామచంద్రయ్య  అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించాడు. అలా బోరు చేయించిన ద్విచక్ర వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్‌లో నే ఉంచాలని మెకానిక్‌ చెప్పడంతో ఆ వృద్దుడు తన వాహనాన్ని  స్టార్టింగ్ లో ఉంచి ఇంటి గడివేసి  రాత్రి సమయంలో ఆ ఇంటిలోనే నిద్రించాడు. ఆయనతో పాటు మనవరాళ్లు చందన (8), చరిత(8), మనవడు కార్తీక్(15) కూడా అక్కడే నిద్రించారు. కాగా, ద్విచక్ర వాహనం నుండి వెలువడిన  కార్బన్ మోనాక్సైడ్(carbon monoxide) పీల్చుకోవడంతో నిద్రలోనే ఆ నలుగురు మృతి చెందారు.

Also Read :  కట్టెల పొయ్యితో కొన్ని నష్టాలు, మరిన్ని లాభాలు..

Tragedy In Punganur

కాగా ఆదివారం ఉదయం ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా తగిన జాగ్రత్తలు చెప్పకుండా రాత్రంతా బైక్‌ను స్టార్టింగ్‌ లో ఉంచాలని చెప్పి నలుగురి మృతికి కారణమైన వాహన మెకానిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఒకే ఇంటిలో తాత మనవరాళ్లు, మనవడు మరణించడంతో ఆ ఇంటిలో విషాదం నెలకొంది.

Also Read :  ఏపీ నిరుద్యోగులకు ఉగాది గిఫ్ట్.. భారీ జాబ్ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని ఖాళీలంటే..?

Advertisment
తాజా కథనాలు