TTD: వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి..అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది!
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇంత రద్దీ ఎందుకు ఏర్పడుతుంది.ఎందుకు టోకెన్ల కోసం భక్తులు పోటీపడుతున్నారు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇంత రద్దీ ఎందుకు ఏర్పడుతుంది.ఎందుకు టోకెన్ల కోసం భక్తులు పోటీపడుతున్నారు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ఆవేదన చెందారు. తప్పు జరిగింది.. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా అని తెలిపారు. ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదని పేర్కొన్నారు. టీటీడీ, ఇంత మంది సిబ్బంది ఉన్నా ఈ ఘటన జరగటం బాధాకరం అని చెప్పుకొచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ ఈవో, కలెక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలని అధికారులకు క్లాస్ పీకారు. 2వేల మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ గాయపడిన భక్తులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుపతిలో భక్తులు తొక్కిసలాటతో చనిపోలేదని తెలిపారు. రక్తంలో చక్కెర తక్కువగా ఉండటం వల్ల భక్తులు కుప్పకూలిపోయారని చింతా మోహన్ అన్నారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి రోజా అన్నారు. ప్రభుత్వం, TTD ఫెయిల్ అయ్యాయన్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ ఎక్కడా అని ప్రశ్నించారు. తిరుమల చరిత్రలోనే ఎప్పుడూ జరగని ఘోరం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమలలో తొక్కిసలాట ఘటన జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. కానీ ఇంతలోనే భక్తులు వెంకటేశ్వురుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. దీంతో తిరుమలలోని ఘాట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. బైరాగిపట్టెడ పద్మావతి పార్క్ లో తొక్కిసలాట జరిగిన ఘటనకు సంబంధించి నారాయణపురం ఎంఆర్ఓ ఈస్ట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటంబానికి రూ.25 లక్షల చొప్పున అందించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రియా ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను మంత్రులు పరామర్శించారు.