/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ttd-jpg.webp)
TTD
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. దర్శనానికి వెళ్లే భక్తులకు అడవి జంతువులు నుంచి రక్షణ కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడక మార్గాలు, ఘాట్‌రోడ్లలో ప్రయాణించే వాహనదారులకు చిరుత, ఏనుగు, ఎలుగబంట్ల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు యానిమల్ రేడియో కాలర్ సిస్టంను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని కోసం వైల్డ్‌లైఫ్ అధికారుల అనుమతి కూడా కోరినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !
అడవి జంతువులు నుంచి..
ఇదిలా ఉండగా 2023లో అలిపిరి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. అదే ఏడాదిలో నాలుగేళ్ల బాలుడిపై కూడా చిరుత దాడి చేసింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఇలా చిరుతలు కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. గత పదిహేనళ్ల నుంచి అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట, తిరుమల రెండో ఘాట్‌లపై కనిపిస్తుంటాయి. శ్రీవారి పాదాల మార్గంలో కూడా ఏనుగుల గుంపు కనిపిస్తుంటుంది.
ఇది కూడా చూడండి: Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి
టీటీడీ ఎన్నో చర్యలు తీసుకున్నా కూడా ఈ వన్యమృగాల సమస్య మాత్రం అలానే ఉండిపోయింది. ఈ క్రమంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అడవి జంతువులు నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రేడియో కాలర్ సిస్టమ్ తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. దీనివల్ల జంతువులు జనాల మధ్యలోకి వస్తే వెంటనే అలర్ట్ కావచ్చని భావిస్తోంది. ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ విధానం అమల్లో ఉంది.
ఇది కూడా చూడండి: Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!