Tirumala : తిరుమలలో అపచారం.. ఆలయ గోపురం మీదుగా విమానం.. TTD ఆగ్రహం

తిరుమల దేవస్థానం గోపురం పైనుంచి గురువారం విమానం ప్రయాణించింది. ఆగమన శాస్త్ర నిబంధన ప్రకారం గుడిపై నుంచి విమాన రాకపోకలు నిషేదం. దీంతో టీటీడీ వేద పండితులు, భక్తులు విమానయాన శాఖపై మండిపడుతున్నారు. గతంలోనే ఇలా మరోసారి జరగొద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

New Update
TTD flight

TTD flight Photograph: (TTD flight)

గతంలోనే టీటీడీ దేవస్థానంపై నుంచి విమానాలు వెళ్లకూడదని విమానయాన శాఖకి తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. టీటీడీ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని కేంద్ర విమానయాన శాఖపై తిరుమల వేదపండితులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం తిరుపతి దేవస్థానం గుడి గోపురంపై నుంచి విమానం ప్రయాణించింది.

Also read: RAW: అమెరికాలో RWA పై ఆంక్షలు..!

Also Read :  ఏంటీ ఇదంతా PR స్టంటా..కాళ్లు మొక్కడానికి పరాగ్ పదివేలు ఇచ్చాడా?

Plane Flew Over Tirumala Temple

Also read :  Telangana : మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై కీలక ప్రకటన!

ఆగమశాస్త్ర నిబంధనల మేరకు శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి రాకపోకలు నిషిద్ధం. ఇలా జరగడం ఇదే మొదటి సారి ఏం కాదు. గతంలో కూడా ఫ్లైట్లు తిరుమల గుడి పై నుంచి వెళ్లాయి. ఈ విషయాన్ని పలుమార్లు విమానయాన శాఖ మంత్రి దగ్గరకి తీసుకెళ్లారు తిరుపతి దేవస్థాన సిబ్బంది. ఇక నుంచి ఆలయ గోపురం పైనుంచి విమాన రాకపోకలు లేకుండా చూడాలని టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గతంతో పోలిస్తే గురువారం ఆలయ గోపురానికి దగ్గరగా విమానం వెళ్లింది. విమానయాన శాఖ వైఖరిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  తెలంగాణలో మళ్లీ టెన్త్ పేపర్ లీక్!

 

plane flew | andhra-pradesh-news | latest-telugu-news | today-news-in-telugu 

Advertisment
Advertisment
Advertisment