/rtv/media/media_files/2025/02/07/nPb1HC8HyRxY6pwbTziI.jpg)
tirupati Srikalahasti Tangedupalem Cross Road Accident
ఇదో హృదయ విదారక ఘటన. ఓ కుటుంబంలో ఒక ప్రాణం ఊపిరి పోసుకుంటే.. మరోప్రాణం ఊపిరి తీసుకుంది. ఈ ఘటనతో ఆ గ్రామం విలవిల్లాడిపోయింది. అయ్యో.. పాపం అంటూ గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎందుకు దేవుడా.. ఇలా చేశావంటూ కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. . .
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?
పురిటి నొప్పులు రావడంతో . .
తిరుపతి జిల్లాకు చెందిన ఒక మహిళ ఓ వైపు బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే సమయంలో ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసి ఆ మహిళ కన్నీరు మున్నీరైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లాకు చెందిన చెంగమ్మకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త హరికృష్ణ హుటా హుటిన ఆస్పత్రిలో చేర్పించాడు.
ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే
రోడ్డు ప్రమాదంలో. .
అయితే డెలివరీ ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో వాటిని తీసుకురావడానికి బైక్‌పై ఇంటికి వెళ్లాడు. అలా వెళ్తుండగా శ్రీకాళహస్తిలోని తంగేడుపాలెం క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. టెంపో వ్యాన్ హరికృష్ణ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. ఇక భర్త మరణ వార్త విన్న భార్య చెంగమ్మ బోరున విలపించింది. అయ్యో ఏం పాపం చేశానంటూ చెంగమ్మ కన్నీరుమున్నీరైంది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. .