/rtv/media/media_files/2025/02/08/fktQUP9vUjSY3n7sYwav.jpg)
Tirupati Janasena Leader Kiran Royal clarity on woman selfie video
జనసేన నేత కిరణ్ రాయల్‌పై తిరుపతి బైరాగి పట్టుడుకు చెందిన లక్ష్మీ అనే మహిళ తాజాగా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ తనను మోసం చేశాడంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. రూ.కోటికి పైగా డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకుంటా అంటూ లక్ష్మీ కన్నీరు పెట్టుకుంది.
Also Read: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..
3 రాష్ట్రాల్లో కేసులున్నాయ్
లక్ష్మీ ఆరోపణలపై కిరణ్ రాయల్ తాజాగా స్పందించారు. తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. రాజకీయంగా కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆడవాళ్ళని అడ్డుపెట్టుకొని వైసీపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 3 రాష్ట్రాల్లో ఆమెపై కేసులు ఉన్నాయ్ అంటూ మండిపడ్డారు. వైసీపీ దొంగల ముఠా తనపై కక్ష కట్టిందని.. వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఎప్పుడో ముగిశాయి
క్రిమినల్ లేడీ లక్ష్మితో తనపై నిరాధారణమైన ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. రూ.1.20 కోట్లు తనకు ఇచ్చినట్లు లక్ష్మి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. 2016 సంవత్సరంలో 50 లక్షల రూపాయల చీటీలు వేశాం అని.. చీటీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో ముగిశాయి అని తెలిపారు.
Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!
చిల్లర రాజకీయాలు
వైసీపీ తనపై చిల్లర రాజకీయం ఆడుతుందని విమర్శించారు. అప్పుల బాధతో మనస్థాపానికి గురై లక్ష్మి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అన్నారు. అంతేకాకుండా లక్ష్మిపై ఇప్పటికే ఆరు కేసులున్నాయి అని పేర్కొన్నారు. ఇక భూమన అభినయరెడ్డి తనపై చిల్లర రాజకీయాలు చేయిస్తున్నాడు అని మండిపడ్డారు. ఆయనే లక్ష్మిని రెచ్చగొట్టి తనపై పనికిమాలిన ఆరోపణలు చేయిస్తున్నాడని ఆరోపించారు.
పెయిడ్ ఆర్టిస్టులు
జగన్ రెడ్డిని చిట్టి రెడ్డి అని.. భూమన కుటుంబంపై విమర్శలు చేసినందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని.. పెయిడ్ ఆర్టిస్టులతో ఆరోపణలు చేయినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు అని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.