/rtv/media/media_files/2025/03/21/9YNevnliiTofmAn5kwNo.jpg)
ttd tirumala
తిరుమల క్యూ లైన్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. చాలా కాలం నుంచి తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే.. తాజాగా.. ఆధ్యాత్మిక ప్రదేశంలో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో కూర్చునే విషయంలో గొడవ జరిగింది.
Also Read: Minister Ponnam Prabhakar: తెలంగాణలో టీవీ సీరియల్స్ బంద్...?..మంత్రి పొన్నం సంచలనం..!
Tirumala Arguments Between Devotees
తొలుత మాటల యుద్దం, అది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది. ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న గాజు సీసాతో మరో వ్యక్తి తల మీద కొట్టాడు. దీంతో తీవ్రగాయమైంది. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. గాయపడ్డ వ్యక్తిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు.
తిరుమల క్యూ లైన్లో తలలు పగిలేలా కొట్టుకున్న భక్తులు
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2025
ఓ పిల్లాడిని తోసేయడంతో ఆగ్రహించిన తండ్రి.. కర్ణాటక, తమిళనాడు భక్తుల మధ్య పెద్ద గొడవ జరగడంతో ఓ వ్యక్తి గాజు బాటిల్ విసరడంతో భక్తుడి తల పగిలింది. pic.twitter.com/rUXZhjuMNQ
అయితే తమ పిల్లాణ్ని బలవంతంగా నెట్టేశారని, ఇదేమిటని ప్రశ్నిస్తే గొడవకు దిగారని దాడి చేసిన భక్తులు చెబుతున్నారు. ఈక్రమంలో పోలీసులు అక్కడ విచారణ చేపట్టారు.సీసీ కెమెరాలను పరిశిలిస్తున్నారు. గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం లేదని.. తలకు మాత్రం బలమైన గాయమైనట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనతో మిగతా భక్తులకు ఆందోళనకు గురయ్యారు. దేవుడి దగ్గరకు వచ్చి ఇలాంటి పనులు చేయడమేంటని భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇటీవల టీటీడీ తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు రాజనీయ నాయకులు ఇచ్చే సిఫారసుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 24 నుంచి సిఫారసు లెటర్లను అనుమతిస్తామని టీటీడీ ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే.
Also Read: Phone Pay-Google Pay: ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి షాక్.. కొత్త రూల్స్!
Also Read: America-Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్!
ap-crime-news | latest-telugu-news | latest telugu news updates | today-news-in-telugu | andhra-pradesh-news