/rtv/media/media_files/2024/12/10/UKc0uy5M9sG0wmVF0YwE.jpg)
AP Crime
AP Crime: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోతవరానికి చెందన నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విహారయాత్రకు విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తున్నాడు. విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన ఇంటికి చేరకుండానే విగతజీవులుగా మారిపోయారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చింతావారిపేట వద్ద కారు ప్రమాదం జరిగింది. అయితే నిద్రమత్తుతో కళ్లు మూతలు పడుతున్నాయని కారు రోడ్డు పక్కన ఆపిన విజయ్.. భార్య ఉమ డ్రైవింగ్ నాకు వచ్చుగా.. ఇంకా పది కిలోమీటర్ల దూరంలో ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పిడంతో దీనికి భర్త సరే అన్నాడు. దీంతో ఉమ కార్ డ్రైవింగ్ చేస్తూ బయలుదేరారు.
విహారయాత్రక వెళ్లి తిగిరి వస్తుండగా...
కారు కొద్ది దూరం రాగానే అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఉమ (35), రోహిత్ (9), మనోజ్ (7) మరణించగా.. విజయ్ కమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఇంటికి చేరుకుంటారు అనుకుంటే వారంతా శవాలుగా మారడం అందర్ని కలచివేసింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: ఉసిరి రసంలో ఇది కలిపి తాగితే బరువు తగ్గడం ఖాయం
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన కళ్లముందే భార్యాపిల్లలు. కొట్టుకుపోయారని విజయ్ కుమార్ బోరున విలపించారు. విహారయాత్రకు వెళ్లి విగతజీవులుగా మారటంతో రెండు కుటుంబాల మధ్య తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. క్యాన్సర్‌ను చంపాలంటే..
ఇది కూడా చదవండి: చెట్ల పొదల్లో రొమాన్స్..మరో లడ్డు కావాలా నాయనా
ఇది కూడా చదవండి: ఏపీలో 483 టన్నుల బియ్యం పట్టివేత!