/rtv/media/media_files/2025/04/05/VfuXzAIcgSHbhF3PTCcL.jpg)
TDP vs Jana Sena
TDP vs Jana Sena : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజవర్గం పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య రచ్చా రచ్చ మొదలైంది.ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన ఎమ్మెల్సీ నాగాబాబు రెండో రోజు పిఠాపురం నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో అడుగడుగున ఉద్రిక్తతకు దారితీసింది. బారీ పోలిస్ బందోబస్తు మధ్య ఎమ్మెల్సీ నాగబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోడ్లను నిర్మించగా వాటిని నాగబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎమ్మెల్సీ నాగబాబుకు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమానికి వెళ్లగా.. నాగబాబును చుట్టుముట్టిన టీడీపీ నేతలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు. నిన్న, ఈరోజు అడుగడుగున టీడీపీ నుంచి నాగబాబుకు తప్పుని నిరసన సెగలు. జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య రెండ్రోజులుగా చెలరేగుతున్నా వివాదం..బలబలాలు ప్రదర్శించుకుంటున్న ఇరుపార్టీల నేతలు. నిన్న గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ వద్ద ఎమ్మెల్సీ నాగబాబుకి చేదు అనుభవం ఎదురైంది.జై..వర్మ జై..చంద్రబాబు అంటూ టీడీపీ వర్గీయులు నినాదాలు చేశారు. దానికి దీటుగా జనసేన కార్యకర్తలు జై పవన్ కళ్యాణ్ జనసేన అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు.
ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!
ఈరోజు కూడా సేమ్ సీన్ రిపీట్.. ఎమ్మెల్సీ నాగబాబు కుమారపురంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవంలో మరోమారు చేదు అనుభవం ఎదురైంది. జైవర్మ..జై టిడిపి..జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసిన టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దానికి దీటుగా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ తొడలు కొట్టిన జనసేన కార్యకర్తలు. కార్యక్రమం జరుగుతున్నంత సేపు ఎక్కడికి వెళితే అక్కడ జై వర్మ జై టిడిపి నినాదాలు చేస్తున్న టీడీపీ శ్రేణులు. నాగబాబు చేస్తున్న ప్రారంభోత్సవాలకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆహ్వనం లేకపోవడంతో రగిలిపోతున్న టిడిపి శ్రేణులు. దీంతో కుమార్ పురం చిన్న జగ్గంపేటలో ఇదే పరిస్థితి నెలకొంది. యు కొత్తపల్లి మండలం కొత్తపేట,మాయాపట్నం, అమరవెల్లి ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులను కార్యక్రమాలకు రాకుండా పోలీసులు,జనసేన నాయకులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు, శిలాఫలకాలో చంద్రబాబు పేరు ఫోటో ఎందుకు పెట్టలేదని టీడీపీ శ్రేణులు నిలదీశాయి. నాగబాబు కార్యక్రమాన్ని బాయికాట్ చేసి వెనుతిరిగి వెళ్లిపోయిన టిడిపి నాయకులు కార్యకర్తలు. దీనితో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టిడిపి కూటమి నాయకులు మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి.
ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!
దీంతో నాగబాబు వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయితే అక్కడే ఉన్న సీనియర్ జనసేన, టీడీపీ నేతలు వివాదం ముదరకుండా తమ కార్యకర్తలను సముదాయించుకున్నారు. ఇటీవల ఓ సమావేశంలో నాగబాబు పవన్ కల్యాణ్ విజయం పై మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ జనసేన కార్యకర్తలు, ప్రజల ఓట్లతోనే గెలిచారని.. కొంతమంది క్రెడిట్ కోసం పాకులాడుతున్నారని టీడీపీ నేత వర్మను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో నాటి నుంచి పిఠాపురం లో జనసేన, టీడీపీ నేతల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా నాగబాబు పిఠాపురం పర్యటనకు రావడంతో మరోసారి ఈ వివాదం తెరమీదకు వచ్చింది.
ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు