/rtv/media/media_files/2025/02/15/601ThkstltK5hqlPmuBL.webp)
rude behavior
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తల్లి,తండ్రి, గురవు, దైవం అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత రెండో స్థానం గురువులకే కేటాయించారు. ప్రేమతో పాఠాలు చెప్పాల్సిన అలాంటి టీచర్స్ విచక్షణ కోల్పోతున్నారు. స్కూల్స్‌లో కూడా చిన్నారులకు లైంగిక వేధింపులు (Sexual Assualt) తప్పడం లేదు. ఈ దారుణ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. హెడ్మస్టర్ విద్యార్థినీలను లైంగికంగా వేధించడంతో తల్లిదండ్రులు చేయి చేసుకున్నారు.
Also Read : రేపటి నుంచే పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ హైవేపై దారి మళ్లింపు.. రూట్ల వారీగా వివరాలివే!
School Principal Rude Behave On Students
అలమూరు అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వర్, విద్యార్థినిల (Students) పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ దేహశుద్ధి చేశారు. ఈ మేరకు పాఠశాల ఎదుట గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి వికృత చేష్టలకు పాల్పడ్డడాని తల్లిదండ్రులు ఆరోపించారు. నంధ్యాల జిల్లా పాణ్యం మండలం అలమూరు అప్పర్ ప్రైమరీ స్కూల్ కు చెందిన హెడ్ మాస్టర్ బరితెగించాడు. కళ్లు మూసుకుపోయిన మల్లేశ్వర్ పసిపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినిలను లైంగకంగా వేధించాడు. ఈ విషయాన్ని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో వారంతా స్కూలుకు చేరుకుని ప్రధానోపాధ్యాయున్ని నిలదీశారు. అయినా తీరుమారని అతను తల్లిదండ్రుల మీదకే తిరగబడ్డాడు. దీంతో అందరూ కలిసి సదరు హెడ్ మాస్టర్‌కు దేహశుద్ధి చేశారు.
Also Read : చేసింది చెప్పట్లే.. కాంగ్రెస్ కార్యకర్తలు అలిగారు.. TPCC చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
కాగా మల్లేశ్వర్ గత కొంత కాలంగా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూన్నాడంటూ విద్యార్థినీలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై నిలదీయడంత పాటు హెడ్ మాస్టర్ మల్లేశ్వర్‌ను చితకబాదారు. పరిస్థితి విషమించడంతో సహచర ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్‌ను అక్కడి నుంచి తప్పించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు అందోళన చేపట్టారు. హెడ్ మాస్టార్ మల్లేశ్వర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Also Read : వంశీ అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి కొడాలి నాని.. ఏ క్షణమైనా అరెస్ట్..?
Also Read : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే?