/rtv/media/media_files/2025/02/13/KSaXj39mRX8rW7pGQfPy.webp)
Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi: గన్నవరం(Gannavaram) టీడీపీ(TDP) ఆఫీసు పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ను బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వల్లభనేని పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో హైదరాబాద్ రాయదుర్గం పోలీసుల సహాకారంతో వంశీని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు ఆయనను విజయవాడ తరలించారు.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు
వల్లభనేని వంశీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్‌ను బెదిరించిన వంశీ కేసు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపణ. సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి, తీవ్రంగా ఒత్తడి తెచ్చారని కుటుంబ సభ్యుల ఆరోపణ. సత్యవర్థన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వంశీపై మరో కేసు నమోదు చేశారు. కాగా హైదాబాద్‌లో అరెస్ట్ అయిన వంశీని పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వంశీ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్న బాధితులు. వంశీ వేధింపులపై ఓ మహిళ ఫిర్యాదు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also read : మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!
సత్యవర్ధన్‌ను బెదిరించినట్లుగా సెల్‌ఫోన్ ఆడియో రికార్డులన్నీ పోలీసులకు దొరికాయి. తనను బెదిరించి కిడ్నాప్ పాల్పడ్డట్టుగా సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వల్లభనేని వంశీ పై ఎస్సీ, ఎస్టీ, బీఎన్ ఎస్ యాక్ట్ 140 (1), 308, 351 (3), రెడ్‌విత్ 3(5) కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. వంశీ అనుచరుల బెదిరింపు వల్లే కోర్టులో తాను పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసులకు తెలిపారు సత్యవర్ధన్. దీంతో వంశీతో పాటుగా ఆయన ఐదుగురు అనుచరులుపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. నేరం రుజువైతే వంశీకి 140(1) యాక్ట్ కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అనేక కోణాల్లో దీర్ఘంగా విచారిస్తున్నారు పోలీసులు. టీడీపీ గన్నవరం కార్యాలయం పై దాడి నేపథ్యం గురించి ఆయనను ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. దాడిలో ఎంత మంది పాల్గొన్నారు.. దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందని అని వంశీని క్వశ్చన్ చేస్తున్నారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని జీజీహెచ్ కు తరలించనున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు.
ఇది కూడా చదవండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
మీడియాతో మాట్లాడిన వంశీ భార్య పంకజశ్రీ..
అయితే, వల్లభనేని వంశీ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. కొన్ని సాక్ష్యాలను లక్ష్యంగా చేసుకొని వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నారు. వంశీ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఎవిడెన్స్ ను బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు. రిమాండ్ కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. గంట నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీ సతీమణి వచ్చారు. వంశీని కలిసేందుకు ఆమెను పీఎస్ లోపలకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో మీడియాతో మాట్లాడిన వంశీ భార్య పంకజశ్రీ.. మమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించడం లేదని క్వశ్చన్ చేశారు. ఆయన ఆరోగ్యంపై మాకు ఆందోళనగా ఉంది..వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పడం లేదని ఆమె ఆరోపించారు. వంశీని చూడటానికి లోపలికి పంపాలని ఆమె కోరారు. మరోవైపు, కక్షపూరితంగా వంశీపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు అంటూ ఆయన తరపు లాయర్ ఆరోపించారు. కాగా కోర్టు వంశీకి రిమాండ్ విధిస్తే పోలీసులు కస్టడీ ఫిటిషన్ వేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు స్పందించారు. వంశీ అరెస్టును భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. దేశ చరిత్రలో ఎవరూ పార్టీ ఆఫీసు తగలబెట్టలేదు. వంశీ ఆ పనిచేశాడన్నారు.కక్ష సాధింపులు ఉండవంటూనే, తప్పుచేసిన వారిని వదలమని స్పష్టం చేశారు. కేసు పెట్టిన వ్యక్తిని -అచ్చెన్నాయుడు బెదిరించారని తెలిపారు. ఎంతఒత్తిడి తీసుకొస్తే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటారని ప్రశ్నించారు. ఎవరు తప్పుచేసినా విడిచిపెట్టేది లేదన్నారు.
ఇది కూడా చదవండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్