/rtv/media/media_files/2025/03/02/IOmnTFS4F9t6ETJN1gs8.jpg)
AP Assembly, High Court Building Photograph: (AP Assembly, High Court Building)
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం (NDA Governmernt) అమరావతి నగరంలో శరవేగంగా చేస్తోంది. తాజాగా ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో వాటి నిర్మాణాలకు నిధులు కేటాయించింది. హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు CRDA టెంటర్లు ఆహ్వానించింది. శనివారం రూ.768 కోట్ల అంచనా వ్యయంతో శాసనసభ, రూ.1,048 కోట్ల అంచనా వ్యయంతో హైకోర్టు బిల్డింగులు నిర్మించడానికి ఏజెన్సీల నుంచి బిడ్లు పిలిచారు. ఈ నెల 17 మధ్యాహ్నం 3గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు.
Also Read : నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా?
Tender Notification For Construction Of AP Assembly
🚨 Andhra Pradesh government invited bids for constructing world class Assembly and High Court buildings in the new city, #Amaravati.#AndhraPradesh#RecordBreakingGBUTeaser#Trump #ENGvSA pic.twitter.com/oLm6CWksks
— RK/రామకృష్ణ పామర్తి/रामकृष्ण (@RAM2347RK) March 1, 2025
Also Read : మహిళా న్యాయవాదిపై యాసిడ్ దాడి.. కోర్టులోకి వెళ్తుండగా దారుణం!
ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలించారు. 103 ఎకరాల్లో అసెంబ్లీ నిర్మించనున్నారు. బేస్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మూడు అంతస్థుల్లో అసెంబ్లీ బిల్డింగ్ నిర్మించనున్నారు. లండన్‌కు చెందిన ఫోస్టర్స్ సంస్థ ఏసీ అసెంబ్లి బిల్డింగ్ నిర్మాణాన్ని డిజైన్ చేసింది. ఫస్ట్ ఫోర్‌లో మినిస్టర్స్ ఛాంబర్లు, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాలు, క్యాంటీన్లు, సంట్రల్ హాలు, లైబ్రరీ ఉంటాయి. మూడో అంతస్థులో అసెంబ్లీ పైకి ఎక్కి అమరావతి నగ
Also read : Asha Workers: ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా..!
42.36 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు (High Court) ను ఏర్పాటు చేయనున్నారు. ఇది బేస్‌మెంట్‌తోపాటు గ్రౌండ్ ఫోర్, మరో 7 అంతస్థులు ఉండనుంది. ఏడో ఫోర్‌లో పూర్తిస్థాయి కోర్టు సమావేశ మందిరం , డైనింగ్ హాల్, సువిశాల గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు. పైన ఎత్తైన శిఖరం ఉంటుంది. 2019లో హైకోర్టు బిల్డింగ్‌కు జస్టిస్ రంజన్ గోగాయ్ శంకుస్థాపన చేశారు.
Also Read : చర్చ్ ముందే నలుగురు మృతి.. హైటెన్షన్ వైర్లకు తగిలి మలమల మాడిపోయారు