AP: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సోమనాథ్, సుచిత్ర ఎల్ల, సతీష్ రెడ్డి..

పలు రంగాల్లో నిష్ణాతులైన నలుగురిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్‌ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్‌  సోమనాథ్,  సతీష్‌రెడ్డి, సుచిత్ర ఎల్ల,  కేపీసీ గాంధీ లను కేబినెట్ హోదాతో సలహాదరులగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

New Update
AP

AP honor Advisors

స్పేస్‌ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్‌  సోమనాథ్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌కి కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి, చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను గౌరవ సలహాదారులుగా నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం . కేబినెట్ హోదాతో వీరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నలుగురు నెండేళ్ళ పాటూ ఈ పదవుల్లో ఉంటారు. 

నిర్వహించాల్సిన విధులు..

ఏరోస్పేస్, డిఫెన్స్‌ పరిశోధన, తయారీ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయడానికి సతీష్ రెడ్డి మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది.  పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టులు కూడా చేపట్టాల్సి ఉంటుంది. 

చేనేతకు మార్కెట్ ను పెంచడంతో పాటూ  దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. కళాకారులు, సహకార సంస్థలు, ఎంఎస్‌ఎంఈలకు మద్దతిచ్చేలా సుచిత్ర ఎల్లా పని చేయాల్సి ఉంటుంది.  హస్తకళల రంగాల సుస్థిరత, బలోపేతం, అభివృద్ధికి అవసరమైన  సలహాలు..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న విధానాలను సూచించాలి. 

రాష్ట్రంలో ఫోరెన్సిక్‌ మౌలిక వసతులు, మానవ వనరులను మెరుగుపరిచేందుకు నిధులు రాబట్టడం..ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగంలో ప్రపంచంలో అమల్లో ఉన్న అత్యుత్తమ విధానాలు ఆచరణలో పెట్టడం చేయాలి. నేరగాళ్ల ప్రొఫైలింగ్, అనుమానితుల గుర్తింపునకు వీలుగా ఫోరెన్సిక్‌ డేటా ఇంటిగ్రేషన్‌కుకేీసీ గాంధీ సహకారం అందించాలి. 

పరిపాలన, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో స్పేస్‌ టెక్నాలజీని వినియోగించుకోవటానికి అనువుగా అవసరమైన విధానాల రూపకల్పనకు సలహాలివ్వడమే కాకుండా.. అడ్వాన్స్‌డ్‌ స్పేస్‌ టెక్నాలజీ హబ్‌లు, టెస్టింగ్‌ సదుపాయాలు, రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటుపై సోమనాథ్ మార్గదర్శకత్వం వహించాలి. వీటతో పాటూ జీఐఎస్, శాటిలైట్‌ నేవిగేషన్, ఏఐ ఆధారిత స్పేస్‌ ఎనలిటిక్స్‌ వినియోగం మరింత పెరిగేలా చూడాలి. 

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lemon: సమ్మర్ ఎఫెక్ట్.. వాచిపోతున్న నిమ్మకాయల ధరలు.. పిండితే రసం కూడా రావట్లే!

ఎండల్లో తిరిగితే వడదెబ్బ బారిన పడకుండా నిమ్మకాయలు ఎక్కువగా వాడతారు. ఈ ప్రభావంతో నిమ్మకాయల ధర పెరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఏలూరు, రాపూరు, దెందులూరు, తెనాలి, హోల్‌సేల్‌ మార్కెట్లకు రోజూ 2 వేల క్వింటాళ్ల దాకా నిమ్మకాయలు వస్తున్నాయి.

New Update
lemon

lemon

Lemon: వేసవికాల ఎండలు భగభగమండుతున్నాయి. ఎండల్లో తిరిగితే వడదెబ్బ బారిన పడకుండా నిమ్మకాయలు ఎక్కువగా వాడతారు.  ఈ ప్రభావంతో నిమ్మకాయల ధర పెరుగుతోంది. గత నెలలో క్వింటా 6 వేల రూపాయాలు ఉన్న ధర ప్రస్తుతం 12 వేలకు పెరిగింది. ఎండలు, వడగాల్పులు పెరిగే కొద్దీ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ రాష్ట్రంలో ఏలూరు, రాపూరు, దెందులూరు, తెనాలి,హోల్‌సేల్‌ మార్కెట్లకు రోజూ 2 వేల క్వింటాళ్ల దాకా నిమ్మకాయలు వస్తున్నాయి. 

పెరుగుతున్న ధరలు:

ప్రస్తుతం ఏపీలో లక్షా 20 వేల ఎకరాల్లో నిమ్మ తోటలు ఉన్నాయి.  ప్రతి సంవత్సరం 10 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. కాగా... వేసవిలో దిగుబడి తగ్గినా.. 4 లక్షల టన్నుల దాకా ఉత్పత్తి వస్తుందని అంటున్నారు. నీటి వసతి ఉన్న తోటలకు ఈ సంవత్సరం కాపు బాగానే ఉంది. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లో ఒక్కోటి నిమ్మకాయ సైజును బట్టి 4 నుంచి 10 రూపాయాల వరకు అమ్ముతున్నారు.

ఇది కూడా చదవండి: ఆ టాబ్లెట్ వల్ల గర్భిణీ స్త్రీలకు అలసట...ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!

ఎండాకాలం సీజన్‌ ప్రారంభంలోనే నిమ్మకాయల ధరలు చూసి ప్రజలు భయ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ కూరగాయల మార్కెట్‌లో కిలో నిమ్మకాయలు 100లకు విక్రయించారు. అందులో ఒక్కో నిమ్మకాయ సైజ్‌ను బట్టి 5 నుంచి 10 అమ్మేవారు. గత మూడు రోజులుగా కిలో నిమ్మకాయలు 200ల రూపాయాలకు విక్రయిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు నిమ్మకాయ ధరలు చూసి కోనాలంటేన భయ పడుతున్నారు.

ఇది కూడా చదవండి: వీపు మీద మొటిమలు రావడానికి కారణం ఏమిటి?

Advertisment
Advertisment
Advertisment