/rtv/media/media_files/2025/02/20/EcOQfzZWHLC2xAqflmDR.jpg)
YS Jagan Vs Sharimila
Sharmila Vs Jagan: షర్మిలకు పని లేదని.. ఖాళీగా కూర్చొని ట్వీట్‌లు పెడితే తమకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ(YCP Botsa Satyanarayana) ఈ రోజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు జగన్ కు సరైన భద్రత కల్పించడం లేదని బొత్స ఆధ్వర్యంలో వైసీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బొత్స. ఇందుకు కౌంటర్ గా షర్మిల తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: జగన్, కొడాలి నానితో పాటూ..8 మంది వైసీపీ నేతలపై కేసు
రిపోర్టర్: జగన్ కు జైలుకు వెళ్లి ఖైదీలను పరామర్శించడానికి టైం ఉందిగానీ.. అసెంబ్లీకి వెళ్ళడానికి ధైర్యం లేదు అని నిన్న షర్మిల గారు ట్వీట్ చేశారు.
— greatandhra (@greatandhranews) February 20, 2025
బొత్స: ఆమెకు పని లేదు.. ఖాళీగా కూర్చొని ట్వీట్‌లు పెట్టేదానికి మాకు సమాధానం చెప్పాలిసిన అవసరం లేదు.#YSJagan #YSSharmila pic.twitter.com/RWyNUN0Ejf
బొత్స మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుందంటూ ఫైర్ అయ్యారు. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో... రాష్ట్ర ప్రజానీకానికి తెలుసన్నారు. ఐదేళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: YS Sharmila : నేరస్తులను కలిసే టైముంది కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదు ..జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
బొత్స సత్యనారాయణ @BotchaBSN గారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో... రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. 5 ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారు. అధికారం అనుభవిస్తూ…
— YS Sharmila (@realyssharmila) February 20, 2025
ఇది కూడా చదవండి: ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!
ప్రజల సంపద ప్యాలెస్ కు..
పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారన్నారు. ప్రజల సంపదను ప్యాలెస్ కి మళ్లించుకున్నారంటూ ఆరోపించారు. ఐదేళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారని ఫైర్ అయ్యారు. పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారని ఎద్దేవా చేశారు. చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారన్నారు. మిర్చి రైతుల కష్టాలపై వైసీపీ కన్నా ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిందన్నారు. రేట్ల హెచ్చుతగ్గులపై రైతు నష్టపోకుండా రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేసిందన్నారు.
కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని అడిగిందన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా పెట్టుబడి సహాయం రూ.20 వేలు వెంటనే అందించాలని కోరిందన్నారు. ప్రతీ నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి.. 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం మీకుంది కాబట్టి.. వైసీపీని శాసన సభకు వెళ్ళాలని డిమాండ్ చేశామన్నారు. రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభ వేదికగా ఎండగట్టాలని అడిగామన్నారు. అసెంబ్లీకి వెళ్ళే అంశంపై వైసీపీ పాలసీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించాలన్నారు.