/rtv/media/media_files/2025/03/04/YDP6DaCkq1jt6Gow0qwI.jpg)
YSRCP MLC Duvvada Srinivas
DUVVADA : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి మరో షాక్ తగిలింది. ఇవాళ ఒక్కరోజే దువ్వాడపై రాష్ట్రవ్యాప్తంగా ఆరు కేసులు నమోదు అయ్యాయి. పవన్‌పై దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు.గుడివాడ, పెడన, తిరువూరు స్టేషన్లలో దువ్వాడపై ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని అరెస్టు అయ్యారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. కాగా పోసాని తరహాలోనే దువ్వాడపైనా కేసులు నమోదు చేస్తున్నారు.
దువ్వాడ శ్రీనివాస్ గతంలో చేసిన కామెంట్స్‌పై తాజాగా కేసు నమోదైంది. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసైనికుల ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్సీ దువ్వాడ దూషించి,అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.గతంలో టెక్కలిలోని జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేయించినా అప్పట్లో పోలిసులు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా జనసైనికులు ఆరోపించారు.విచారణ జరిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు
Aslo Read: TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లోను జనసేన నాయకులు దువ్వాడపై ఫిర్యాదు చేశారు. గత నెల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు ప్రతినెల యాబై కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తున్నారంటూ విమర్శలు చేశారు. దీన్ని గుడివాడ జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దువ్వాడ శ్రీనివాస్ పై విడుదల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దువ్వాడ శ్రీనివాస్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు.
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
ఇప్పటికే వ్యక్తిగతంగా దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని కాదని ,దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య , కూతుర్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో వారు టెక్కలిలోని ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వాణి తన కూతుళ్లు, తండ్రితో కలిసి అక్కడే బైఠాయించారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం వ్యవహారం కోర్టులో నడుస్తోంది. తన వల్ల పార్టీకి ఇబ్బంది వస్తుందని, తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని అధినేత జగన్‌ను కోరానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అయితే త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెప్పారని దువ్వాడ శ్రీనివాస్ ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. మరీ తనపై నమోదైన కేసుపై దువ్వాడ శ్రీనివాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: భర్తపై విష ప్రయోగం.. ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే ప్రియుడితో..
Also read : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..