Sankranti Spl Trains: ఏపీకి మరో 52 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే!

సంక్రాంతికి ఏపీకి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా 52 స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లు వెళ్లనున్నాయి.

New Update
Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

Santranti Spl Trains

Santranti Spl Trains: సంక్రాంతి పండుగకు ఏపీ ప్రజలు వెళ్లాలని అనుకుంటారు. కానీ రైలు, బస్సులు అన్ని రద్దీగా ఉండటం వల్ల ప్రయాణ సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతూళ్లకు చేరేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా 52 స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైలు లిస్ట్‌ను విడుదల చేసింది. జనవరి 6వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు ఆయా ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లు వేశారు. ఎక్కువగా తిరుపతి, కాకినాడ టౌన్ వరకు రైళ్లను నడుపుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

అదనపు ఛార్జీలు..

ఇదిలా ఉండగా ఇటీవల 90 రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను నడుపుతున్నారు. గతేడాది సంక్రాంతికి 70 ప్రత్యేక రైళ్లను నడిపారు. ఈ ఏడాది వీటి సంఖ్యను పెంచారు. తెలంగాణ నుంచి దాదాపుగా 160 నుంచి 170 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సమాచారం. మరి ఇంకా రైళ్ల సంఖ్యను పెంచుతారనే తెలుస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు సాధారణ రైళ్లతో పోలిస్తే అదనంగా ఉంటాయని చెప్పారు. స్పెషల్‌ ట్రైన్స్‌ అనేవి అదనపు రద్దీ కొరకే నడుపుతున్నందున కొద్ది మొత్తంలోనే అదనపు ఛార్జీలుంటాయి. ప్రత్యేక రైళ్లు కూడా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలానే ఒకే మార్గంలో ప్రయాణిస్తాయి.

ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amzath Basha Brother Arrest in mumbai : మాజీ డిప్యూటీ సీఎంకు షాక్.. ముంబైలో తమ్ముడు అరెస్ట్..

అధికార పార్టీ ఎమ్మెల్యేలను నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వరుసగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంజద్ బాషాకు షాక్ తగిలింది. ఆయన తమ్ముడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు.

New Update
Amzath Basha Brother Arrest in mumbai

Amzath Basha Brother Arrest in mumbai

Amzath Basha Brother Arrest in mumbai : అధికార పార్టీ ఎమ్మెల్యేలను నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వరుసగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంజద్ బాషాకు షాక్ తగిలింది. ఆయన తమ్ముడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ముంబయి నుంచి కడపకు తీసుకువస్తున్నారు. రేపు కడప కోర్టులో హాజరు పరచనున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులురెడ్డిని దూషించారనే ఫిర్యాదులతో పాటుగా ఓ స్థలం విషయంలో దాడి చేశారనే ఆరోపణలపై అహ్మద్ బాషా మీద కేసులు ఉన్నాయి. అహ్మద్ బాషాపై లుక్‌ అవుట్‌ నోటీసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషా కువైట్ వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్లు తెలిసింది. అహ్మద్ బాషాపై కడపలో కేసు నమోదైంది. వినాయకనగర్‌లోని ఓ స్థలం విషయంలో దాడిచేశారని ఫిర్యాదు రావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఈ కేసుతో పాటుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను అసభ్యకర పదజాలంతో దూషించారంటా అహ్మద్ బాషాపై కేసులు ఉన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో నేత శ్రీనివాసుల రెడ్డిపై పోలీసు స్టేషన్‌లోనే దాడి చేసేందుకు అహ్మద్ బాషా యత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కడప పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ముంబయి నుంచి కడపకు తీసుకువస్తున్నారు. సోమవారం కడప కోర్టులో అహ్మద్ బాషాను హాజరు పరిచే అవకాశముంది.

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

మరోవైపు పోలీస్ స్టేషన్‌ నుంచి తన అనుచరుణ్ని అంజాద్ బాషా బలవంతంగా తీసుకెళ్లడం శనివారం సంచలనం రేపింది. కడప పట్టణంలోని రాజారెడ్డి వీధి, బుడ్డాయపల్లెకు చెందిన కొంతమంది మహిళల వద్ద మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి రూ.50 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే అప్పు తీసుకుని 13 ఏళ్లు దాటినా తిరిగి చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన మహిళలు నిలదీయగా.. ఆ డబ్బులను ఇబ్రహీం మియా అనే వ్యక్తికి ఇచ్చానని చెప్పారు. ఇబ్రహీం మియా కోసం మహిళలు గాలించగా పాత బస్టాండు వద్ద శుక్రవారం కనిపించాడు. దీంతో మహిళలు ఇబ్రహీం మియాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కడప ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

అయితే ఇబ్రహీం మియా అంజాద్ బాషా అనుచరుడని తెలిసింది. దీంతో అంజాద్ బాషా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇబ్రహీం మియాను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు.. అంజాద్‌ బాషా ఇంటికి వెళ్లి ధర్నాకు దిగారు. వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసులు ఇరువర్గాల పైనా కేసులు నమోదు చేశారు. తనపై దాడి చేశారని ఇబ్రహీం మియా ఇచ్చిన ఫిర్యాదుతో మహిళలపై కేసు నమోదు చేశారు. అలాగే డబ్బులు ఇవ్వాలని అడిగితే అసభ్యకరంగా మాట్లాడాడని మహిళలు ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీం మియాపైనా కేసు నమోదైంది.

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

 

Advertisment
Advertisment
Advertisment