మాజీ మంత్రి కొడాలి నాని హార్ట్ ఆపరేషన్ ఏప్రిల్ 2న విజయవంతంగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించారు. చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు 8 గంటల పాటు ఈ సర్జరీ నిర్వహించి సక్సెస్ చేశారు. ఇక సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో కొడాలి నాని సన్నిహితులు, వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
ఐసీయూలో పర్యావేక్షణలో
ఇదిలా ఉంటే నాని ఆరోగ్య పరిస్థితిపై వైకాపా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకర్లతో సమావేశంలో మాట్లాడారు. కొడాలి నానికి బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని ఆయన అన్నారు. హాస్పిటల్ చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే ఆధ్వర్యంలో సుమారు 8 నుంచి 10 గంటల పాటు ట్రీట్మెంట్ జరిగిందని తెలిపారు. ఈ సర్జరీ అనంతరం నాని కొద్ది రోజులపాటు ఐసీయూలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని అన్నారు.
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
ప్రస్తుతం నాని బాగానే ఉన్నారని.. ఆయన అవయవాలన్నీ బాగా స్పందిస్తున్నాయని వైద్యులు ధ్రువీకరించినట్లు హనుమంతరావు పేర్కొన్నారు. అంతేకాకుండా కొడాలి నాని అభిమానులకు మరో షాకింగ్ అప్డేట్ చెప్పారు. ఆయన మరో నెల రోజులపాటు ముంబయిలోనే ఉంటారని అన్నారు. వీలైనంత త్వరగా కొడాలి నాని కోలుకుని తిరిగి మనందరి ముందుకు రావాలని తామంతా ఆకాంక్షిస్తున్నామన్నారు. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు టెన్షన్ పడుతున్నారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!
(kodali nani | ap-ycp | latest-telugu-news | telugu-news)