Breaking: చిత్తూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.గంగాసాగరం వద్ద ఆగిఉన్న టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే ?
20 అడుగుల దూరంలో బోల్తాపడి...
క్షతగాత్రులను వేలూరు సీఎంసీ, నరివి ఆసుపత్రులకు తరలించారు.తిరుపతి నుంచి ట్రావెల్స్ బస్సు మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు 20 అడుగుల దూరంలో బోల్తాపడి రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఉన్న కరెంటు పోల్ బస్సులోకి చొచ్చుకుపోయింది. దీంతో నలుగురు అక్కడే చనిపోయారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి, మరో ఆరుగురిని చీలపల్లి సీఎంసీ ఆసుపత్రికి, ఒకరిని నెర్వి ఆసుపత్రికి తరలించారు. చిన్నచిన్న గాయాలు అయిన క్షతగాత్రులు వివిధ ఆస్పత్రులకు వెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్నవెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు అతని పీఏ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పర్యవేక్షిస్తూ క్షతగాత్రులను పరామర్శిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
Also Read: Trump: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న ట్రంప్..కారణమేంటి