/rtv/media/media_files/2025/03/17/slTVGEyhP8m7YJojhdTy.jpg)
Anakapalle...trains stopped
APNews : అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో - క్వారీ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద పెద్ద రాళ్లతో వెళ్తున్న లారీ సేఫ్టీ గడ్డర్ ఢీకొన్నది. దీంతో రైల్వే వంతెన కుంగింది. వంతెన కుంగడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీన్ని గమనించిన అనకాపల్లి నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు లోకోపైలెట్ రైలును నిలిపివేశాడు. గూడ్స్ రైలు రైల్వే వంతెన మీద నిలిచిపోవడంతో రైల్వే లైన్ బ్లాక్ అయింది.
Also Read: భూమి మీదకు బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
ఈక్రమంలో విశాఖ- విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపేశారు. ఎలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేశారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. విజయవాడ నుండి విశాఖ వెళ్ళు పలు రైళ్లు అన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లను మరో ట్రాక్ కు మళ్లించారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌కు మరమ్మత్తులు చేస్తున్నారు.సుమారు 8 రైళ్లు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే స్పందించిన అధికారులు రైల్వే ట్రాక్‌ను సరిచేయడానికి మరమ్మతు బృందాలను రప్పించి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఒక ట్రాక్‌పై మాత్రమే రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. మరొక ట్రాక్‌పై మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన వల్ల రైల్వే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రైళ్లు ఆలస్యంగా నడవడం వల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని రైళ్లు దారి మళ్లించబడినట్లు సమాచారం.
Also Read: తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం
ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. మరమ్మతులు పూర్తయ్యేంత వరకు ఆ ట్రాక్‌పై రాకపోకలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఒక ట్రాక్‌పై మాత్రమే రైళ్లను నడిపే చర్యలు తీసుకోవడంతో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ, సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్ల ప్రయాణ సమయాలు మరింత ఆలస్యం అవుతాయని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ట్రాక్‌ను త్వరగా సరిచేసేందుకు ప్రత్యేక బృందాలను పంపించి, మరమ్మతు పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
Also read: Pakistan terrorist : పాకిస్తాన్‌లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది
ఈ సంఘటన వల్ల రైలు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తమ రైళ్లు ఆలస్యంగా నడవడం, నిరవధికంగా ఎదురుచూడాల్సి రావడంతో చాలా మంది ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన భారీ వాహనాన్ని గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. వాహనం డ్రైవర్‌పై చర్యలు తీసుకునే విధంగా రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. వాహనంపై నియంత్రణ లేకుండా బ్రిడ్జి కింది నుంచి వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి