/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/The-remand-of-six-accused-in-the-Viveka-murder-case-has-been-extended.jpg)
pulivendula
వైఎస్ వివేకా హత్య (YS Vivekananda) కేసులో పులివెందుల పోలీసులు (Pulivendula Police) వేసిన పిటిషన్ ను పులివెందుల కోర్టు తిరస్కరించి కొట్టేసింది. 2023లో వైయస్ సునీత, సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని వత్తిడి చేస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అప్పట్లో పోలీసులు ఈ ఫిర్యాదు నమోదు చేయలేదు.
Pulivendula Court Dismiss Police Petition
దీంతో పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టు (Pulivendula Court) లో ప్రైవేటు కేసు వేశాడు. కోర్టు అదేశంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కృష్ణారెడ్డి ఫిర్యాదు కొట్టివేయాలంటూ హై కోర్టులో వైఎస్ సునీత కేసు వేశారు. అయితే కేసు కొనసాగించాల్సిందేనని హై కోర్టు తీర్పు చెప్పింది. హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ వైఎస్ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తాజాగా పీఏ కృష్ణారెడ్డి (PA Krishna Reddy) పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు వేశాడు దీంతో ఆ ఫిర్యాదు తప్పు అంటూ పులివెందుల కోర్టుకు పోలీసులు నివేదించారు. ఈ కేసును తప్పుడు ఫిర్యాదుగా పరిగణించాలని పోలీసులు పులివెందుల కోర్టును కోరారు. అయితే పులివెందుల కోర్టు పోలీసుల అభ్యర్థనను కొట్టివేసింది. సుప్రీం కోర్టులో కేసు పెండింగులో ఉండగా కేసు అసత్యమని ఎలా చెబుతారంటూ కోర్టు వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే తమపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణ అధికారి రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్లపై సైతం విచారణ జరిగింది. వివేకా హత్య కేసు పరిణామాలను న్యాయస్థానానికి వీరి తరుఫున న్యాయవాది లూథ్రా వివరించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చ్ 3కు వాయిదా వేసింది న్యాయస్థానం. దర్యాప్తు అధికారిపై ప్రైవేట్ కంప్లైంట్ తో విచారణను అడ్డుకున్నారని లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసును రూపు మాపాలనే ప్రయత్నం చేశారని వివరించారు.