/rtv/media/media_files/2025/03/18/pA0YrJ0cbcstHZ8c5LSc.jpg)
Prakash Raj satires Photograph: (Prakash Raj satires)
సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ AI టెక్నాలజీతో ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. తాజాగా ఎక్స్‌లో AI చాట్‌బాట్ గ్రోక్‌కు ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేసి అందులో ఉన్నవి ఎంత వరకు నిజం అని అడిగాడు. ఆయన షేర్ చేసిన వీడియో పొలిటికల్ మీమ్స్‌కు సంబందించింది. మూవీ సీన్స్, మోదీ ఇంటర్య్వూలను ఎడిట్ చేసి ట్రోల్ చేసిన వీడియో అది. అందులో మోదీ ఏం చువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారనే విషయాలపై ఒక్కో ఇంటర్య్వూలో ఒక్కో రకంగా చెప్పారు. అయితే ఈ వీడియో షేర్ చేసి అందులో ఎంత వరకు నిజం ఉందని ప్రకాశ్‌రాజ్ ఏఐ గ్రోక్‌ను అడిగాడు. ఎప్పటిలాగే ఆయన ట్విట్ చివర జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్ యాడ్ చేశారు.
Also read: Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ!
Hi @grok … how much of details expressed in this video is true #justasking https://t.co/WJxOg3LSrE
— Prakash Raj (@prakashraaj) March 17, 2025
ఇండియన్ జెమ్స్ అనే ఎక్స్ అకౌంట్ పోస్ట్ చేసిన ఎడిటెడ్ వీడియోతో ప్రకాశ్ రాజ్ ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పై కూడా ప్రకాశ్‌రాజ్ కౌంటర్ చేశారు. తమిళనాడులో హిందీ వివాదంపై పవన్ కళ్యాణ్ మాట్లాడగా.. దానికి ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చాడు ప్రకాశ్ రాజ్. పవన్ కళ్యాణ్ కూడా వేదికలపై ఆయన చదువు గురించి పొంతన లేని సమాధానాలు చెప్పిన వీడియోలు ఇటీవల ట్రోల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియో ద్వారా ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారా? లేక మోదీని మాత్రమే టార్గెట్ చేస్తూ కౌంటర్ వేశారా అనేది మాత్రం తెలియదు. ప్రకాశ్‌రాజ్ సెటైర్లు, కౌంటర్లు ఇదే కొత్త కాదు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్లు, సెటైర్లు ఎక్స్ ద్వారా ఇస్తునే ఉంటారు. గతంలో చాలా సార్లు ఇలా జరిగింది. ప్రకాశ్ రాజ్ పోస్ట్ చూసిన ఎక్స్ యూజర్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఆయన్ని సమర్థిస్తూ కొందరు రాసుకొస్తే.. మరికొందరు తిడుతూ కామెంట్లు చేశారు.