/rtv/media/media_files/2025/02/18/oLsLZ6QM9cI055sRwzXq.jpg)
Vidadala Rajini
Vidadala Rajini: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో విడదల రజినితోపాటు ఆమె పీఏలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: మలైకా అరోరాకి ఇష్టమైన జ్యూస్ ఇదే.. అది ఎలా తయారు చేయాలో తెలుసా..
సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నానంటూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే విడదల రజిని, ఆమె పీఏలతోపాటు పోలీసులు తనను వేధించారంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాననే కారణంతో 2019లో పిల్లి కోటిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన చిలకలూరిపేట పట్టణ సీఐ తనను కోర్టులో ప్రవేశపెట్టకుండా.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్ రాయల్ సంచలన ఆడియో!
నాటి ఎమ్మె్ల్యే విడదల రజిని అదేశాలతోనే తనను అరెస్ట్ ఇబ్బంది పెట్టారని పిల్లికోటి హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాక తనను కులం పేరుతో దూషించారని కూడా ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికి.. వారిపై చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఆ క్రమంలో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తన పిటిషన్‌లో పిల్లి కోటి ఆవేదన వ్యక్తం చేశారు. రజిని పీఏలు సైతం తనను తీవ్రంగా వేధించారని ఆయన కోర్టుకు తెలిపారు.
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
ఈ నేపథ్యంలో కోటి పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. ఆ క్రమంలో విడదల రజిని, ఆమె పీఏలు రామకృష్ణ, ఫణితో పాటు నాటి చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణలపై కేసు నమోదు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి దర్యాప్తు వివరాలను తమకు సమర్పించాలని పల్నాడు జిల్లా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందులోభాగంగా విడదల రజిని, ఆమె పీఏలు రామకృష్ణ, ఫణికుమార్‌తోపాటు సీఐ సూర్యనారాయణలపై చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయన్న సమాచారం మేరకు విడదల రజినితో పాటు మిగతా ముగ్గురు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు.
Also Read: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే..ఈ వివరాలు మీ కోసమే!
తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా
ఈ సందర్భంగా తమకు ముందుస్తు బెయిలు మంజూరు చేయాలని ఈ నెల 10న ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పిటిషనర్‌పై నాలుగు కేసులు ఉన్నట్లు తన పిటిషన్‌లో రజిని కోర్టుకు తెలియజేశారు.ఈ కేసుల్లో తమపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీ కుదుర్చుకునే ఉద్దేశంతోనే అతడు తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని రజని తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలని రజని తన పిటిషన్‌లో హైకోర్టును అభ్యర్థించారు. దీంతో విడదల రజినితోపాటు ఆమె పీఏలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసినట్లు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read: దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!