/rtv/media/media_files/2025/03/10/vBq1fkh15K6sUyYkeKk6.jpg)
Posani Krishna Murali
Posani Krishna Murali : ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏడో తేదీన తీర్పును రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్.. ఇవాళ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్చు ఇచ్చారు. ఇక బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేశారు మేజిస్ట్రేట్. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్ షాక్.. రావడం కష్టమే
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో గత నెల 24వ తేదీన కేసు నమోదు అయిన విషయం విదితమే కాగా.. ఈ కేసులో గత నెల 28వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. 29వ తేదీన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చగా.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, గత సోమవారం పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.వైసీపీ లీగల్ టీమ్ న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు పోసాని తరఫున వాదనలు వినిపించగా ఈ రోజు నరసరావుపేట కోర్టు మేజిస్ట్రేట్ వారు బెయిల్ మంజూరు చేశారు.
Also Read: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్
పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 3 నెలల క్రితం జనసేన నేత ఫిర్యాదుతో విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పీటీ వారెంట్‌పై పోసాని కృష్ణమురళిని విజయవాడ కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరారు. ఇప్పటి వరకు పోసానిపై మొత్తం 16 కేసులు నమోదవ్వగా.. ఐదు కేసుల్లో రిలీఫ్ లభించింది. పాలకొండ, భవానీపురం, పాడేరు, విశాఖ, పట్టాభిపురంలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోసాని.
Also Read : Congress: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. హాజరైన సీఎం రేవంత్
Also read : చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు!