/rtv/media/media_files/2025/03/27/9hd2VY3LhsvRCfexxVZC.jpg)
Recording dances in Pithapuram
సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏవైనా పండుగలు, పబ్బాలకు అక్కడక్కడ రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఈ డాన్సులు ఒక్కోసారి శ్రుతిమించిపోతుంటాయి. చుట్టూ మహిళలు ఉన్నా.. స్టేజ్‌పై రెచ్చిపోయి డాన్స్‌లు చేస్తుంటారు. న్యూడ్ అవతారంలో కనిపించి కుర్రాళ్లలో హీట్ పెంచేస్తుంటారు.
Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
12 మంది అమ్మాయిలతో
తాజాగా అలాంటి డ్యాన్స్ షో ఏపీలో మరోసారి కనిపించింది. పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పోలేరమ్మ జాతర జరిగింది. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులు రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేశారు. దాదాపు 12 మంది అమ్మాయిలతో ఈ డ్యాన్స్ షో నడిచింది. యువతను రెచ్చగొట్టే పాటలతో.. మత్తెక్కించే స్టెప్పులతో అర్థరాత్రి వరకు ఈ రికార్డింగ్ డాన్సులు జరిగాయి.
పవన్ కళ్యాణ్ ఇలాకాలో రికార్డింగ్ డాన్స్ లు జోరు..
— RTV (@RTVnewsnetwork) March 27, 2025
పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో అశ్లీల నృత్యాలు
పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్సులు
12మంది అమ్మాయిలతో యువతను రెచ్చగొట్టే పాటలతో.. మత్తెక్కించే స్టెప్స్ తో అర్థరాత్రి… pic.twitter.com/1ruqasIcAO
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
దీంతో స్థానికులు, ఆ గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కన్నెత్తి చూడటం లేదని వారు మండిపడుతున్నారు. ఇంకొందరు కూడా ఫైర్ అవుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఇలాంటి అశ్లీలత కలిగిన డాన్స్ షోలకు ఎలా పర్మిషన్ ఇస్తున్నారంటూ ప్రజలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
(Recording Dance | latest-telugu-news | telugu-news | pitapuram | pawan-kalyan)