/rtv/media/media_files/2025/03/24/mqaDQP8HQEqE0rXn1BpD.jpg)
Janasena Party
Janasena Party : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆ సంతృప్త ఎమ్మెల్యేలు ఇటీవల విజయవాడలోని ఒక హోటల్‌లో రహస్యంగా సమావేశమయ్యారన్న వార్త గుప్పుమంది. ఈ సమావేశానికి జనసేన కీలకనేత, మంత్రి నాదెండ్ల మనో హర్ సైతం హాజరయ్యారని సమాచారం. ఈ రహస్య సమావేశంలో తమతమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమ నియోజకవర్గా్ల్లో టీడీపీ ఇన్‌చార్జీల మాటే చెల్లుబాటవుతుందని, ఎమ్మెల్యేలను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వాపోయినట్లు తెలుస్తోంది.
Also Read : నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు : KTR
ముఖ్యంగా నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనకు, టీడీపీకి మధ్య సమన్వయం లోపిస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారనే ప్రచారం కూటమి పార్టీల్లో సంచలనంగా మారింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పరిస్థితులు.. తమ మాట చెల్లుబాటు పైనే ప్రధానంగా చర్చ చేసినట్లు సమాచారం. కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 21 మంది ఎమ్మెల్యేల్లో మంత్రులుగా ఉన్న ముగ్గురు మినహా మిగిలిన 18 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి వివరించారు. అధికారులు తమ మాట వినడం లేదన్న ధోరణిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి పనికి జనసేన మంత్రుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందని మనోహర్ కు వివరించినట్లుగా తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో టీడీపీ ఇంఛార్జ్ ల మాటకే ప్రాధాన్యత దక్కుతుందని వాపోయినట్లు చెబుతున్నారు.
Also read : తల్లి డైరెక్షన్..కొడుకులు యాక్షన్.. షేక్ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్
ఎందుకీ పరిస్థితి డిప్యూటీ సీఎంగా పవన్, మంత్రులుగా ఉన్న మనోహర్ .. దుర్గేశ్ నియోజకవర్గాల్లో మాత్రం వారి మాట చెల్లుబాటు అవుతుందని చెప్పుకొచ్చారు. తమ నియోజకవర్గాల్లో అధికారులకు ఏం చెప్పినా పట్టించుకోవటం లేదని మొర పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కందుల దుర్గేశ్ నియోజకవర్గంలోనూ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు సమాచారం. తాము నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నా.. పనులు అవ్వటం కోసం ముగ్గురు మంత్రుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే రకంగా భవిష్యత్ లోనూ కొనసాగితే నియోజకవర్గంలో తమకు విలువ లేకుండా పోతుందని.. పరిస్థితుల్లో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.
Also read : గువాహటి ఐఐటీ పరిశోధకుల అద్బుతం.. అంతర్జాతీయ సరిహద్దులపై రోబోల నిఘా !
ఇదే సమయంలో పార్టీ పరిస్థితులు.. ప్రజలతో మమేకం కావాల్సిన అంశాల పైన ప్రస్తావనకు వచ్చి నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారి మాటే అమలవుతోందని.. తమ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెప్పుకొచ్చినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇంచార్జ్ ల మాటే చెల్లుబాటు కావటంతో తాము ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని.. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు డిప్యూటీ సీఎం పవన్ కు తెలిసేలా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారని చెబుతున్నారు. కాగా, మీటింగ్ లో జరిగిన అంశాల పైన ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి సమాచారం ఉందనే వాదన ఉంది. కాగా, ఈ సమావేశం పైన జనసేన ఎమ్మెల్యేలు ఓపెన్ గా స్పందించటానికి నిరాకరిస్తున్నారు.
Also Read : జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్