/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/heart-attack-can-be-preceded-by-many-different-symptoms.jpg)
గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కాలేజీ ప్రొఫెసర్ సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న అభివృద్ది చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తోంది. దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణం. అర్థరాత్రి, తెల్లవారుజామున గుండెపోటు వస్తే ఆ సమయంలో బాధితులు వెంటనే మాత్రలు వేసుకోలేకపోతున్నారు.
Also Read: అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా భారతీయుడు..అసలేవరి భట్టాచార్య!
New Drug Formula To Prevent Heart Attack
ఈ ప్రతికూలతలను అధిగమించి కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడం పై ఆచార్యుడు సాయి కిషోర్, పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న పరిశోధనలు చేశారు. నాలుగున్నరేళ్లకు పైగా శ్రమించి గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతి నిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పులేకుండా చూడొచ్చని తెలుసుకున్నారు.
Also Read: అది ఏఆర్ డెయిరీ నెయ్యి కాదు.. సిట్ విచారణలో సంచలన విషయాలు!
రాత్రి భోజనం తరువాత 9 గంటలకు ఈ క్యాప్సూల్స్ వేసుకుంటే అర్థరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతి నిరోధకాలను విడుదల చేసి గుండె పోటును సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధనల ద్వారా నిరూపించారు.
Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!
కుందేళ్ల పై రెండు దశల్లో ఈ ఔషధాన్ని పరీక్షించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి పరిశోధనా గ్రంథం సమర్పించారు. అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీలో పరిశోధన పత్రం ప్రచురితమైంది.
తమ ఔషధ ఫార్ములా పై పేటెంట్ హక్కు కోసం ఈ సంవత్సరం మేలో దరఖాస్తు చేశామని , తాజాగా కేంద్ర పేటెంట్ సంస్థ పేటెంట్ జారీ చేసిందని ఆచార్యుడు సాయి కిశోర్ తెలిపారు. పేటెంట్ పొందిన బృందాన్ని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కాలేజీ ప్రిన్సిపల్ గోపాల కృష్ణమూర్తి అభినందించారు.
Also Read: UP: పాపం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు వైద్యులు మృతి!