/rtv/media/media_files/2025/03/25/Xf9flZZi3mvaviIgoVjF.jpg)
Nellore quartz mining Case registered on Kakani Govardhan Reddy
BREAKING: ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ ఇష్యూలో పొదలకూరు పీఎస్‌లో కేసు నమోదైంది. రూ.250 కోట్ల క్వార్ట్జ్ దోపిడీ చేశారంటూ కాకాణితో పాటు మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ బుక్కైంది. ఈ మేరకు రుస్తుం అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ ను A4గా చేర్చారు. దీంతో కాకాణిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే ఇద్దరి అరెస్టు..
ఈ మేరకు అధికారం అడ్డంపెట్టుకుని కాకాణి అక్రమ మైనింగ్ చేశారంటూ మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. అవినీతికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఫిబ్రవరి 16న కాకాణి అనుచరుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వాకాటి శివా రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదు అయింది. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా.. మొత్తం పది మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి ఏ1, ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డిలు ఏ2, వాకాటి శివారెడ్డి, ఏ3లుగా ఉన్నారు.
Also Read: ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
అయితే గడువు ముగిసిన మైన్‌లో ఇష్టానుసారంగా జెలిటెన్ స్టిక్స్ ఉపయోగించడం, అర్ధరాత్రి యంత్రాలతో తవ్వకాలు చేసి క్వార్ట్జ్‌ను తరలించినట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అప్పట్లో ఆందోళన చేశారు. అప్పటి డీడీ శ్రీనివాసకుమార్, సూపర్‌వైజర్ సుధాకర్, ఆర్‌ఐ హెచ్.దేవీసింగ్, టీఏ హసీనాబాను దీనిని పరిశీలించారు. దాదాపు 61,313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్‌ను అక్రమంగా తరలించినట్లు గుర్తించి సీనరేజ్ ఛార్జీలతో పాటు జరిమానా విధించారు. మొత్తం రూ.7.56 కోట్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇక రుస్తుం మైన్‌లో అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలకు పాల్పడినట్టు ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశామని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి తెలిపారు.
Also Read: మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి...
ellore | kakani-govardhana-reddy | mining | case | telugu-news | today telugu news | rtv telugu news nellore