/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tiger-jpg.webp)
AP News : పెంచలకోన దేవాలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతపులి గురించి ఎవరూ భయపడొద్దని అటవీశాఖ అధికారులు చెప్పారు. పులి అక్కడినుంచి పారిపోయిందని, భక్తులు భయబ్రాంతులకు గురికావద్దని సూచించారు. ఒంటరిగా తిరగొద్ద, అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
Also Read : ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం
సంచారం చేసిన ఆనవాళ్లు గుర్తింపు..
ఉమ్మడి నెల్లూరులోని రాపూరు మండలంలోని పెంచలకోన దేవాలయం పరిసరాల్లో చిరుతపులి సంచారంతో భక్తులు భయప్రాంతులకు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ విషయం మీద రాపూరు అటవీశాఖ క్షేత్రాధికారి రవీంద్రబాబు మాట్లాడుతూ.. బుధవారం రాత్రి 10గంటల సమయంలో పెంచలకోన క్షేత్రం పరిసరాల్లో చిరుతపులి సంచారం చేయడం చూసి భక్తులు సమాచారం ఇచ్చారు. వాళ్ల మొబైల్లో పులిని చిత్రీకరించారు. అది తెలియగానే జిల్లా అటవీ శాఖ అధికారి వెంటనే స్పందించి అక్కట ఉన్నటువంటి బేస్కాంప్, స్ట్రైక్ ఫోర్స్, సిబ్బందిని పంపించి పులి సంచారం చేసిన ఆనవాళ్లు గుర్తించామని చెప్పారు.
Also Read : ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది..
అయితే పులి అక్కడి నుండి అడవిలోకి పారిపోయిందని నిర్ధారించారు. పెంచలకోన క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులు, భక్తులు దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వన్యప్రాణులు కనబడినపుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. అదే విధంగా అవి క్రూరమృగాలు కాబట్టి వాటి దగ్గర యాత్రికులు ఫోటోలు తీసుకోవడం వంటి పనులు చేయకుండా జాగ్రత్త వహించాలి. వాహన దారులు క్షేత్రానికి ప్రవేసించేటపుడు ఎక్కువ వేగంగా వెళ్లకూడదు. వన్యప్రాణులను, అడవులను సంరక్షించుకోవలసిన బాధ్యత మనందరిది. అదేవిధంగా జిల్లా అటవీశాఖ అధికారుల సూచనల మేరకు అక్కడ ఉన్న అటవీ సిబ్బంది అన్నీ విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రజలు, భక్తులు, యాత్రికులు భయపడాల్సిన పనిలేదని రాపూరు అటవీశాఖ క్షేత్రాధికారి రవీంద్ర బాబు తెలిపారు.
ఇది కూడా చదవండి: వచ్చేసిన నరేష్ బచ్చల మల్లి టీజర్.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడుగా..
ఇక అటవీ శాఖ అధికారులు డీఎఫ్ఓ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. సంఘటన స్థలానికి చేరుకొని పులి అడుగులను బట్టి అడవిలోకి వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. గుడి పరిసరాల ప్రాంతంలో, గుడి దగ్గరలో పులి లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఎవరు తిరగవద్దు అని అడవిలోకి ఎవరు వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: అదానీ ఇష్యూలో జగన్ పరువు నష్టం దావా.. వారందరికీ లీగల్ నోటీసులు!