/rtv/media/media_files/2025/02/15/f9yRNU0PBmFYA82xQzWk.jpg)
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ట్రస్ట్ కు, శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి , దాతలకు హృదయపూర్వక అభినందనలు. ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ఇది ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు కొత్త ఆశలు… pic.twitter.com/v1WkiPzETC
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) February 15, 2025
Also Read : USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్
మనోధైర్యంతో ఉంటే
పీడియాట్రిక్ వార్డు, ఐసీయూను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. క్యాన్సర్(Cancer)తో ఎంతోమంది బాధపడుతున్నారని చెప్పిన బాలయ్య.. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు 200 మంది చిన్నారులకు బోన్ మార్పిడి చేశామని, ఆర్థిక స్థోమత లేని వారికి వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యత అని తెలిపారు.
బసవతారకం ఆస్పత్రిలో పిడియాట్రిక్ అంకలాజీ యూనిట్‌ని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ..
— Mr Yash (@YashTDP_) February 15, 2025
ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి సేవలు...#NandamuriBalakrishna pic.twitter.com/pKRlJBi2KQ
మరోవైపు అమరావతిలో గతంలో స్థలాలు కేటాయించిన సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్ని తిరిగి పునరుద్ధరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అప్పట్లో వారితో చేసుకున్న ఒప్పందాల గడువు ముగిసిపోవడం, ఇందులో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో తిరిగి వారిని తీసుకొచ్చేందుకు అధికారుల స్ధాయిలో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే తాను ఛైర్మన్ గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి బ్రాంచ్ ను అమరావతిలో పెట్టేందుకు గతంలో బాలయ్య అంగీకరించారు.
Also Read : విశాఖ వసంత కేసులో బిగ్ ట్విస్ట్..పోలీసులకు దిమ్మతిరిగే షాక్ !