/rtv/media/media_files/2025/03/04/Uygmao4bNGgfyYVgLJlq.jpg)
Minister Nara Lokesh Responds on Online Betting Victim's Video
ఈమధ్య కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు పెరిగిపోయాయి. చాలామంది వీటికి అలవాటైపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అప్పులు చేసి మరీ ఈ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు. చివరికీ అప్పులు ఎక్కువై వాటిని కట్టలేక.. కొందరు భయంతో, మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఏపీలో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసాద్ అనే వ్యక్తి కూడా ఆన్‌బెట్టింగ్‌లు ఆడి మోసపోయాడు. తన భార్య, పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుంటామని సెల్ఫీ వీడియో తీశాడు.
Also Read: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ వీడియోను RTV ఎక్స్‌లో షేర్ చేయగా.. దీనికి మంత్రి నారా లోకేష్ స్పందించారు. వాళ్లను ఇంటికి తిరిగిరావాలని కోరారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్‌గా లక్ష్మీ ప్రసాద్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇటీవల ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరికి పెన్షన్ డబ్బులతో పరారయ్యాడు. ఆ తర్వాత ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో మోసపోయానని.. నా కుటుంబం, పిల్లలు రెండ్రోజులుగా ఏమీ తినలేదని చెప్పాడు. నెలరోజుల్లో పెన్షన్ డబ్బులు చెల్లిస్తానని.. జిల్లా కలెక్టర్, దాచెపల్లి కమిషనర్ తనను క్షమించాలని కోరారు.
Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
RTV అధికారిక ఎక్స్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి మంత్రి లోకేష్ స్పందించారు. '' మనుషులుగా మనం తప్పులు చేస్తుంటాం. కానీ వాటి నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం. మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండండి. మీ కుటుంబ భద్రతపై మేము బాధ్యతలు తీసుకుంటాం. ఇంటికి సురక్షితంగా రండి'' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
We all make mistakes as humans, but it's crucial to learn from them. Please prioritize your family's well-being and avoid betting apps that destroy lives. We care about your safety and well-being; please return home safely. https://t.co/2mRuicBEUP
— Lokesh Nara (@naralokesh) March 4, 2025
Also Read: 'మీరు పెంచితే మేము పెంచుతాం'.. అమెరికాకు చైనా షాక్