/rtv/media/media_files/2025/03/07/7ryrdJcPh2oEeZNZUKco.jpg)
Nara Lokesh
రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. వచ్చే క్యాబినెట్ కు టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెస్తామని స్పష్టం చేశారు. టీచర్ల బదిలీల వ్యవహారం ఎంత గందరగోళంగా ఉంటుందో అందరికీ తెలుసునని, అలాంటి లిస్టును బహిరంగంగా పెట్టబోతున్నామని తెలిపారు. తద్వారా టీచర్లు తమ సీనియారిటీని స్వయంగా చూసుకోవచ్చని తెలిపారు. దీన్ని అత్యంత పారదర్శకంగా పబ్లీష్ చేస్తామని నారా లోకేశ్ ప్రకటించారు.
Also Read: ఆ తుపానుకు అదుపులో ఉండమని చెప్పండి.. సీఎం రేఖాగుప్తా కీలక వ్యాఖ్యలు
‘ఐబీ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. వీటి ఏర్పాటుకు నివేదిక తెప్పిస్తామని రూ.5 కోట్లు ఖర్చు చేసింది. ‘వన్ క్లాస్ - వన్ టీచర్’ విధానాన్ని నేను బలంగా విశ్వసిస్తా. ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే ఈ విధానం ఉంది. 10 వేల స్కూళ్లలో దీన్ని అమలు చేస్తాం. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తున్నాం. వారికి నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నాం. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది’’ అని నారా లోకేశ్ అన్నారు.
Also Read: తాళీ, బొట్టు ఉంటేనే భర్తలకు మూడొస్తుంది.. ఆ కేసులో జడ్జీ సంచలన కామెంట్స్!
Nara Lokesh Gave Good News To Teachers
ఉపాధ్యాయుల బదిలీలు , ప్రమోషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రక్రియను వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో జాబితాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల డీఈవోలను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే టీచర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపిన నారా లోకేష్.. ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామన్న నారా లోకేష్.. త్వరలోనే బదిలీల ప్రక్రియ చేపడతామంటూ తెలిపారు.
Also Read: ఆడ బిడ్డకు తల్లైన అఘోరి.. వైరల్ అవుతున్న సంచలన వీడియో..!
ఇక ఉపాధ్యాయుల బదిలీల (Teacher Transfers) కోసం.. బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం- 2025 రూపొందించామన్న నారా లోకేష్.. ఈ ముసాయిదా చట్టంపై ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను పంపాలని కోరారు.ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ ముసాయిదా చట్టంపై తమ సలహాలు, సూచనలను draft.aptta2025@gmail.comకు మెయిల్ చేయాలని నారా లోకేష్ కోరారు. మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇటీవల సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.
Also Read: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్
ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యలపై సమీక్షించిన నారా లోకేష్.. టీచర్ల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై సమీక్ష జరిపిన లోకేష్.. జీవో 117పై చర్చించారు. ఈ జీవోకు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. వర్క్ షాప్ ద్వారా వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అలాగే డీఎస్సీ నిర్వహణపైనా అధికారులతో నారా లోకేష్ చర్చించారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్స్ సీనియారిటీ లిస్టు పబ్లిష్ చేయబోతున్నాం. వచ్చే క్యాబినెట్ కు టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెస్తాం. #APBudget2025#PrajaBudget2025#APAssembly#IdhiManchiPrabhutvam#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/MOe3vo5Rwa
— Telugu Desam Party (@JaiTDP) March 7, 2025