/rtv/media/media_files/2025/02/26/LhS5En2eTTlwjYivbgT2.jpg)
Nara Lokesh
గుంటూరు జిల్లా మంగళగిరిలోని చినకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఆసుపత్రి భవన నమూనాపై ఆయన అధికారులతో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన నమూనాను అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
Also Read: తమిళనాడులో విజయ్ పార్టీని గెలిపిస్తా.. ధోని కంటే ఫేమసవుతా : ప్రశాంత్ కిషోర్
లోకేష్ మట్లాడుతూ '' మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి. అత్యాధునిక వసతులతో వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దాలి. దేశానికి రోల్ మోడల్‌గా తయారుచేయాలి. ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా ఉండాలి. రోగులకు అత్యుత్తమ వైద్యం అందించాలి. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలి. డాక్టర్లు, పేషంట్లు, విజిటర్స్ కోణంలో జోన్లు రూపొందించాలి. ఆసుపత్రుల భవన నమూనాలను పరిశీలించి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలి. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలి.
Also Read: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం
పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాను రూపొందించాలని'' మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఎమ్ఎస్ఐడీసీ(ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) సీఈ జి.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ వి.చిట్టిబాబు, ఈఈ సీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
Also Read: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
Also Read: ఐడియా అదిరింది గురూ.. కుంభమేళా నీళ్లతో ఊరంతా స్నానం.. సెల్యూట్ చేయాల్సిందే!